Thursday, July 18, 2013

పరుగు--ఆహారము , Food for running exercise

  •  

  •  
పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.


పరుగుకి సరితూగే వ్యాయామం మరొకటి లేదు. రోజూ కొద్ది నిమిషాల పరుగుతో ఎన్నో రకాల రోగాల్ని దూరం చేసుకోవచ్చు. అయితే రన్నర్లు ఆహారంలో కింది వాటిని తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి .
  •  బాదం: వీటిలో యాంటీ ఆక్సిడెంట్‌ అయిన విటమిన్‌ 'ఇ' ఉంటుంది. ఇది కీళ్ల నొప్పుల్ని దూరం చేస్తుంది. బాదంలో ఉండే ప్రొటీన్‌, ఫైబర్లు పరుగు సమయంలో ఆకలి తెలియకుండా సాయపడతాయి. రోజూ పిడికెడు చొప్పున వారంలో అయిదు రోజులపాటు బాదం తినాలి. 
  • ఆరెంజ్‌: పరుగుతీసేవారు రోజూ ఒక కమలా లేదా 200మి.లీ. రసం తాగడం మరిచిపోకూడదు. కమలాలో ఉండే 'సి' విటమిన్‌ కండరాల అరుగుదలను నివారిస్తుంది. అంతేకాదు దీన్లోని ఇనుము నిల్వలవల్ల అలసట, నీరసం దూరమవుతాయి. 

  • చిలగడ దుంపలు: పరుగెత్తేటపుడు చెమటతో పాటు పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజలవణాలు కూడా శరీరంనుంచి బయటకుపోతాయి. చిలగడ దుంపల్లో ఈ ఖనిజలవణాల నిల్వలు అధికస్థాయిలో ఉంటాయి. వారంలో మూడురోజులు ఈ దుంపల్ని తీసుకోవాలి.

  •  చేపలు: మిగతా వ్యాయామాలు చేసేవారితో పోల్చితే రన్నర్లకి(రోజూ 60-90 గ్రాములు) రెట్టింపు ప్రొటీన్లు అవసరమవుతాయి. వారంలో రెండ్రోజులు చేపల్ని ఆహారంలో తీసుకోవడంద్వారా వీరు తమకు అవసరమయ్యే ప్రొటీన్లను పొందొచ్చు. చేపలోని ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు గుండె ఆరోగ్యాన్ని పెంచుతాయి కూడా. శాఖాహారులు మీల్ మేకర్ వంటి సోయాపోటీన్‌ ఉన్న పదార్ధాలు , అటువంటి ఆహారము తీసుకుంటే సరిపోతుంది . పప్పులు , చిక్కుడు గింజలు తో కూడిన ఆహారము తినాలి .
  • ============================================
Visit my Website - Dr.Seshagirirao

No comments:

Post a Comment