Tuesday, August 6, 2013

Sports cum energy drinks and health, వ్యాయామ పానీయాలు లేదా శక్తి నిచ్చే పానీయాలు మన ఆరోగ్యము

  •  



పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.

 ఏధైనా పనిచేసేటప్పుడు , వ్యాయామము చేసేటప్పుడు మనకు శక్తి కావాలి. వ్యాయామము చేస్తున్నప్పుడు  పోషకాలు , నీటిని కోల్పోతాము . దీనివలన అలసట కలిగి performance ప్రభావితము అవుతుంది. ఎవరైనా స్పోర్ట్స్ ను హాబీగా లేదా ప్రొఫెషనల్ లేదా ఫిట్ నెస్ కోసము చేపట్టే వారికిదంతా అనుభవమే. ఇలా వ్యాయామము చేసేవారు , నిరంతరము పని చేసేవారు , ఆటలు ఆడేవారు ఎప్పుడూ ఎనర్జీ డ్రింక్ లను పక్కనే ఉంచుకుంటారు. శక్తి అవసరమే ... దానికొరకు ఆహారము తీసుకోవాలి. మరి ఈ స్పోర్ట్స్ డ్రింక్స్ ఎంతవరకు మంచిది . వీటివల్ల మేలుకంటే హానే ఎక్కువ జరుగుతుందని నిపుణులు విశ్వస్తున్నారు. ముఖ్యముగా దంతవైద్య నిపుణులు .

స్పోర్ట్స్ లేదా ఎనర్జీ డ్రింక్స్ ఎక్కువగా తాగడము వలన టూత్ ఎనామిల్ గా పేర్కొనే పంటిపైగల్ గ్లాసీ లేయరు ను శాశ్వితముగా తొలగిస్తుంది. ఈ డ్రింక్స్ లో ఉండే అత్యదిక యాసిడ్ పదార్ధాలు దీనికి కారణము  . స్పోర్ట్స్ డ్రింక్స్ కంటే ఎనర్జీ డ్రింక్స్ రెండితలు ఎక్కువ హాని  కలుగజేస్తాయి. సెల్యులర్ స్థాయిలో ఎసిడిటీ మన శరీరాన్ని ఏవిధంగా ప్రభావితము చేస్తాయంటే వీటిలో ఉన్న యాసిడ్స్  ' హైడ్రోజన్‌ ప్రోటీన్‌ అయాన్స్ ' తో  శాచ్యురేట్ అయి మన శరీరము నుండి శక్తిని లాగుతాయి. మన శరీరాలు సహజముగా ఆల్కలైన్‌ తో డిజైన్‌ అయివుంటాయి. స్పోర్ట్స్ లేదా ఎనర్జీ డ్రింక్స్ తాగడము వలన ఆల్కలైన్‌ బ్యాలెన్స్  ప్రిజర్వేషన్‌మోడ్ నుండి ప్రొటేక్ట్ మోడ్ లోనికి మారుతుంది. పైగా ఇవి శరీరములో ఏ రకంగా నూ శక్తిని పెందలేవు ... నిజానికి శక్తిని తగ్గిస్తాయి. ఎనర్జీని పంచుకొవాలంటే ఈ పానీయాలపట్లే మొగ్గుచూపాల్సిన అవసరములేదు .  వర్కవుట్లు , జిమ్ములు లో, ఆటల్లో శక్తి చాలడములేదనుకుంటే ఎనర్జీ డ్రింక్స్ తో పనిలేకుండా ఒక అరటిపండు తిని తగినంత మినరల్ వాటరు తాగితే సరిపోతుంది. స్పోర్ట్స్ డ్రింక్స్ లో ఉంటే చెక్కెరలు కంటే అరటిపండు లో ఉండే చెక్కెరలు ఆరోగ్యవంతమైనవి .
  • ==========================
Visit my Website - Dr.Seshagirirao...

No comments:

Post a Comment