అడ్డసరం, మలబార్ నట్ ట్రీ
అడ్డసరం ఒక విధమైన ఔషధ మొక్క. దీని పండ్లు , మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .
ఈ మొక్కను మలబార్ నట్ ట్రీ, అడూస అని కూడా పిలుస్తారు. దీని శాస్ర్తీయ నామం ''అడహతోడ వాసికా నీస్''. అడ్డసరం పొలం గట్ల మీద 1-4 మీటర్ల ఎత్తువరకు పెరిగే బహువార్షిక పొద. ఈ మొక్కు సామాన్య పత్రాలు కణుపునకు రెండు చొప్పున అభిముఖంగా అమరివుండి పొడవుగా, దీర్ఘవృత్తాకారంలో దళసరిగా, పెళుసుగా ఉంటాయి. ఆకర్షనీయమైన తెల్లని పూలు గుత్తులు గుత్తులుగా పూస్తాయి. .
ఉపయోగాలు
- దీని ఆకులు, పుష్పాలు, వేర్లు, బెరడును ఔషధాల్లో విరివిగా వాడతారు. అడ్డసరం మొక్కలో వాసిసిన్, అఢతోడిక్ ఆమ్లం, సుగంధ తైలం ఉంటాయి.
- దగ్గు, ఆయాసం నివారణకు అడ్డసరం ఆకులు, వేర్లు అత్యంత ఉపయుక్తమయినవి. దీర్ఘకాలంగా దగ్గుతో బాధపడే వారు, ఊపిరి అందక ఆయాస పడేవారు వేరు కషాయంలో కొద్ది పంచారం చేర్చి 15 మి.లీ చొప్పున రోజుకు మూడుసార్లు తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది.
- అడ్డసరం పుష్పాలను సుఖవ్యాధుల నివారణ కు వాడతారు.
- ఈ మొక్కలోని అన్నిభాగాలు నులి పురుగులను నివారిస్తాయి. ఉబ్బసం ఉపశమానికి కూడా ఇది ఉపయోగపడుతుంది.
- అడ్డసరం ఆకుల కషాయం రోజుకు మూడుసార్లు సేవిస్తే రక్త విరేచనాలు, వాంతిలో రక్తం పడడటం, మొండి జ్వరాలు తగ్గుతాయి.
- గోరువెచ్చని ఆకు కషాయం చర్మానికి పూస్తే తామర, దురద, గజ్జి, దద్దుర్లు తదితర చర్మవ్యాధులు, చర్మదోషములందు అడ్డసరము (వైద్యమాత) కషాయము ను త్రాగించిన తగ్గుతాయి.
- నరముల రోగహరములు, పట్లు, నొప్పులు హరించును . నీళ్ళవిరేచనములు కట్టును . నేత్రరోగహరము గా పనిచేయును .
- అడ్డసరము ఆకులను దగ్గుకు, ఉబ్బసానికి, రక్త శ్రావ లోపాలకు, చర్మ వ్యాధులకు మందుగా వాడతారు.
source : wikipedia.org.
- ========================
No comments:
Post a Comment