మార్జువానా ...(గంజాయిని అలాగే పిలుస్తారు) --గంజాయి Cannabaceae కుటుంబానికి చెందిన వార్షిక ఔషధ మొక్క. ప్రజలు అనేక అవసరముల కోసం చరిత్రలో అన్ని చోట్ల గంజాయిని సాగు చేసారనడానికి ఆధారాలున్నాయి.
పారిశ్రామిక అవసరముల కొరకు నారను, విత్తనముల నుండి నూనెను, ఆహారంను, మందుల తయారి కొరకు ఈ గంజాయి మొక్కను ఉపయోగించారు.
మానసిక, శారీరక ఒత్తిడుల నుండి ఉపసమనాన్ని పొందడానికి ఈ మొక్క యొక్క వివిధ భాగాలను వివిధ ప్రదేశాలలో వివిధ రకాలుగా ఉపయోగిస్తున్నారు.
ఈ గంజాయి మొక్క 5 నుంచి 8 అడుగుల ఎత్తు పెరుగుతుంది. దీని శాస్త్రీయ నామం Cannabis sativa. ఇది పుష్పించినపుడు విపరీతమైన వాసన చాలా దూరం (అర కిలోమీటరు) వరకు వస్తుంది.
గంజాయి మొక్క మనదేశానికి సుపరిచితం.పూర్వకాలంలో recreational గా హక్కలో వాడేవారు. ధనవంతులు,రాజులు,సామంతులు-స్త్రీలు,పురుషులు కూడా హక్కపీచ్చేవారు.గంజాయిని మెక్సికో దేశంలో మార్జువానా అంటారు. గంజాయిలో 84 cannabinoid drugs ఉన్నాయట. కెనాబిడయాల్,కెనాబినాల్,టెట్రా హైడ్రో కెనాబినాల్ వంటి psycho active పదార్ధాలున్నాయి.అందుకనే గంజాయి పేల్చేవారికి Tension తగ్గటం, మనస్సు తేలిక పడటం,ఆ హ్లదకరంగా feel అవ్వటం ఇత్యాది భావనలు వస్తాయి.మోతాదు ఎక్కువైతే నోరుతడారి పోవటం,కళ్ళు ఎర్రబారటం,హుస్వకాలపు మతిమరుపు ,భయం ఇత్యాది సమస్యలు వస్తాయి.గంజాయి అలవాటైతే వదలనే వదలదని అభిప్రాయం,అనుభవంతో చెప్పిన మాట ఇంతకుముందు జోగులు,సన్యాసులు,బైరాగులు గంజాయి పీల్చేవారు.గంజాయి పీల్చి సంగీతం వింటుంటే ఆ ఆనందమే వేరనేవారు కవులు కూడా. మొత్తం మీద దీన దుష్ర్టభావాలను గ్రహించి 20వ శతాబ్డంలో గంజాయి వాడకాన్ని నిషేధించారు.
ఇటీవల కొంతమంది వైద్యులు ఏమంటున్నారంటే,గంజాయి దుర్గుణాలు గంజాయికి ఉన్న మాట నిజమే కాని ఔషధలక్షణాలు కూడా ఉన్నాయి .గంజయి మొక్కలో మొత్తం 483 కాంపౌండ్స్ ఉన్నాయి.వాటిల్లో 84 కెవాబినాయిడ్స్ ఉన్నాయి.కొన్ని వైద్యంలో పనికి వస్తాయి అంటున్నారు.ఉదాహరణకు cancer treatment తీసుకుంటే chemotherapy వలన ఆకలి చచ్చిపొతుంది; వికారంగా,వాంతి చేసుకుందా మన్నట్లుగా ఉంటుంది.దీనికి గంజాలు మంచి వైద్యం.ఆస్మా(ఉబ్బసం)లో, depression లో కూడా బాగా పనిచేస్తుందని అంటున్నారు. Dronabinol వంటి మందుల్ని గంజాయి నుంచే తీస్తారు.కాని,దుర్లక్షణాలు తక్కువేమీ కావు కాబట్టి నిషేధాన్ని అట్లాగే ఉండనివ్వాలని నిపుణులు అంటున్నారు.
మాదకద్రవ్యాల్లో ఒకటైన మార్జువానాను ఉపయోగిస్తే అనేక ఆరోగ్య సమస్యలు పరిష్కరించబడతాయని ప్రాచీన కాలం నుంచి జనం నమ్మకం. అయితే మార్జువానాను ఔషధంగా మోతాదుకు మించి ఉపయోగిస్తే మనుషుల్లో జ్ఞాపక శక్తి నశిస్తుందని, మెదడు పనిచేసే తీరులో అసాధారణ మార్పులు వస్తాయని తాజా పరిశోధనల చెబుతున్నాయి. మరీ ముఖ్యంగా స్కిజోప్రెనిక్ మానసిక వ్యాధిగ్రస్తులైన వ్యక్తులలో కనిపించే లక్షణాలు మార్జువానాను సేవించే వారిలో కనిపిస్తాయని చెప్పారు.
స్కిజోప్రేనియా బులెటిన్ అనే జర్నల్‌లో ప్రచురించిన ఒక వ్యాసం ఈ దిగ్బ్రాంతికరమైన విషయాన్ని బయటపెట్టింది. మానసిక వ్యాధిగ్రస్తులలో కనిపించే తీవ్ర లక్షణాలకు మార్జువానా కారణమవుతోందని అధ్యయనంలో తేలడం ఇదే మొదటిసారి. అమెరికా లో కొన్ని రాస్ట్రాలలో స్వేచ్ఛావిప ణిలో గంజాయి అమ్మకాలు జరగడం కారణంగా నేరాలు పెరిగే వీలుందని భయాందో ళనలు చెందుతున్నవాళ్లూ లేకపోలేదు
గంజాయి శరీర ఆరోగ్యానికి మంచిదేనని కొందరూ, కాదని మరికొందరూ సిగపట్టు పడుతున్న అమెరికాలో పరిశోధన చేస్తున్నారు. మన సాధువులు గంజాయి దమ్ము పట్టిస్తూ, సామూహికంగా అనుభవిస్తూ, అది ముక్తి మార్గానికి సన్నిహితమని నమ్మారు. రానురాను గంజాయి పండించడం, తాగడం, అమ్మడం ప్రపంచవ్యాప్తంగా నేరం కింద ప్రకటించారు. అయినా దొంగచాటుగా పండిస్తూ, వ్యాపారం సాగిస్తున్నారు.
మూలము : ఆంధ్రప్రభ 23 Dec 2013
- ============================
No comments:
Post a Comment