దీని శాస్త్రీయ్ నామము " beta vulgaris" . ఆకులు , దుప , రెండు తినేందుకు వాడతారు . టేబుల్ షుగర్ తయారీలో బీటు దుంపను వాడుదురు . "batanins " అనే పదార్ధము తో పేస్టు , జాం , ఐస్ క్రీం వంటి వాటి కలర్ ను ఇంప్రూవ్ చేయడానికి పనివచ్చును . శక్తినిచ్చే శాకందుంపల్లో బీట్‌రూట్‌ది ప్రత్యేక స్థానం. ఇది కనులకు ఇంపుగా కనిపించడమే కాదు. ఆరోగ్యానికి ఎంతో మంచిది కూడా. ఎనీమియాతో బాధపడేవారు రోజూ ఒక కప్పుడు బీట్‌రూట్ రసం తాగితే త్వరగా కోలుకుంటారు.
చరిత్ర : ఆకృతిని బట్టి దీనిలో ఎన్నో రకాలు ఉన్నాయి . యూరప్ లోని మెడిటరేనియన్ ప్రాంతం లేదా పశ్చిమ ఆసియా ప్రాంతానికి చెందినదిగా భావిస్తారు . గత రెండువేల సంవత్సరాలుగా కూరగా వాడుతున్నారు . ప్రాచీన గ్రీకులు , రోమన్లు కూరగాయగా వాడినట్లు చెప్తారు . అక్కడ నుండి ఇంగ్లండ్ , ప్రాన్స్ , జర్మనీ లకు రొమన్ల ద్వారా చేరింది . మనదేశం లో అన్ని ప్రదేశాలలో విసృతం గా సాగుచేస్తున్నారు .
వైద్య పరంగా :
- డయాబెటిక్ లివర్ ను కాపాడును ,
- కొలెస్టిరాల్ ను తగ్గించును ,
- మలబద్దకం ను నివారించును ,
- బీట్ రూటు రసము రక్తపోటును తగ్గించు .
- బోరాన్ ఎక్కువగా ఉన్నందున "aphrodisiac "గా సెక్స్ హోర్మోన్స్ ఎక్కువచేయును .
- కొంతవరకు కాన్సర్ నివారణ కు ఉపయోగ పదును .
పోషకాలు : 100 గ్రాములలో
- మాయిశ్చర్ ----87.7 శాతము ,
- ప్రోటీన్లు -------1.7 %,
- ఖనిజాలు -----0.8%,
- పీచు --------0.9%
- కార్బోహైడ్రేట్స్ -8.8%,
- కాల్సియం ----18 మి.గ్రా. శాతము ,
- ఫాస్పరస్ -----55 మి.గా %,
- ఇనుము -----1.0 మి.గా%,
- జింక్ --------0.2% ,
- థయామిన్---0.04%,
- రిబోఫ్లేమిన్---0.09%,
- నియాసిన్----0.4 మి.గా %,
- విటమిన్ సి --10% ,
- కాలరీస్ -----43 కేలరీలు ,
దీని లాభాలు ఎన్నో తెలుసా!
* బీట్‌రూట్‌లో నైట్రేట్‌ల నిల్వలు అధికం. ఇవి నైట్రేట్ ఆక్సైడ్‌లుగా మారి రక్తప్రసరణ వేగాన్ని పెంచుతాయి. ఫలితంగా రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడాన్ని నివారిస్తాయి.
* బీట్‌రూట్ రసం తాగిన మూడు గంటలకు రక్తపోటులో తగ్గుదల ఉంటుందనీ, దీనివల్ల అనవసర ఆందోళనను దూరం చేసుకోవచ్చనీ ఇటీవల ఓ పరిశోధనలో తేలింది.
* క్రీడాకారులు బీట్‌రూట్ జ్యూస్ తాగి పరిగెత్తినపుడు తక్కువ ఆక్సిజన్ తీసుకుంటారు. అందువల్ల త్వరగా అలసిపోరు.
* ఓ తాజా పరిశోధన ప్రకారం రోజుకి 400మి.లీ. చొప్పున రెండ్రోజులు బీట్‌రూట్ జ్యూస్ తాగిన వృద్ధుల్లో మెదడు భాగంలో రక్త ప్రసరణ వేగం పెరిగి ఆలోచనల్లో చురుకుదనం కనిపించింది.
- పరుగు వేగాన్ని పెంచే బీట్‌రూట్
- ==========================
No comments:
Post a Comment