Monday, August 10, 2009

పనస, Jack Fruit


  •   
పండ్లు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో అవసరం లేకుండా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం . పనస తొనలు తినడానికి చాలా రుచిగా ఉంటాయి . మనప్రాంతములో పనసను ఎక్కువగా విందు భోజనాలలో కూరగా వాడుతారు . పనస పొట్టు తో ఆవపెట్టినచో ఉరగాయగా వాడవచ్చును .

అజీర్ణం, పాండు వ్యాధి, నంజు, కడుపునెప్పి, అగ్నిమాంధ్యం, క్షయ, శుక్ర నష్టం, అండవాతం మొదలైన వ్యాధులున్నవారు పనసపండును తినరాదు. చెట్టున పండిన కాయను, కోసిన వెంటనే తింటే, అదంత రుచికరంగా ఉండదు. తయారైన కాయను కోసి, నిలువ ఉంచితే, ఆ పనస తొనలు చాలా తియ్యగా ఉంటాయి. పనస చెట్టు ఆకులతో విస్తర్లు కూడా కుడుతుంటారు. ఈ పండు విరేచనాన్ని బంధిస్తుంది. ఎక్కువగా తింటే అతిసారం కలుగుతుంది. పనస పాలను, ద్రాక్షా సారాయంలో నూరి పట్టు వేస్తే, దెబ్బ, వాపులు తగ్గుతాయి. పండిన పనస ఆకులను, వేరును చర్మ వ్యాధులకు ఉపయోగిస్తుంటారు. దీని మ్రానుతో వీణలు, మద్దెలలు చేస్తుంటారు. దీనిని సంస్కృతంలో “స్కంధఫలం” అని, హిందీలో “కటహక్‌-కటహర్‌-చక్కీ” అని, బంగ్లా‌లో “కాంటల్”‘ అని, మరాఠిలో “పణస” అని, ఆంగ్లంలో “ఇండియన్‌ జాక్‌ ఫ్రూట” అని‌ అంటారు.  

వైద్య పరము గా : జీర్ణ శక్తిని మెరుగు పరచును , జారుడు గుణము కలిగివున్నందున మలబద్దకం నివారించును , పొటాసియం ఎక్కువగా ఉన్నందున రక్తపోటు ను తగ్గించును , విటమిన్ సి ఉన్నందున వ్యాధి నిరోధక శక్తిని మెరుగుపరచును , ఫైటోన్యూట్రియంట్స్ (phytO nutriyants) , ఐసోఫ్లేవిన్స్ (isOphlavins) ఉన్నందున కాన్సెర్ నివారణకు సహాయపడును .

Nutritional Value of Jackfruit Given below is the amount of nutrients present in 100 gm of jackfruit:

  •  Sodium - 3 mg 
  •  Total Carbohydrates - 24 g 
  •  Dietary Fiber - 2 g 
  •  Protein - 1 g 
  •  Vitamin A - 297 IU 
  •  Vitamin C - 6.7 mg 
  •  Thiamin - 0.03 mg 
  •  Riboflavin - 0.11 mg 
  •  Niacin - 0.4 mg 
  •  Vitamin B6 - 0.108 mg 
  •  Folate - 14 mcg 
  •  Calcium - 34 mg 
  •  Iron - 0.6 mg 
  •  Magnesium - 37 mg 
  •  Phosphorus - 36 mg 
  •  Potassium - 303 mg 
  •  Sodium - 3 mg 
  •  Zinc - 0.42 mg 
  •  Copper - 0.187 mg 
  •  Manganese - 0.197 mg 
  •  Selenium - 0.6 mcg 
  •  Total Fat - 0.3 mg 
  •  Saturated Fat - 0.063 mg 
  •  Monounsaturated Fat - 0.044 mg 
  •  Polyunsaturated Fat - 0.086 mg 
  •  Calories - 94
=======================
visit my website : Dr.Seshagirirao.com

No comments:

Post a Comment