- కరివేపాకు ఒకరకమైన సుగంధభరితమైన ఆకులు గల చెట్టు. సువాసన గల చిన్న వృక్షం. (Curry leaves or Sweet Neem Leaves). దీని శాస్త్రీయ నామము "Murraya Koenigii".. తెలుగు లో కరివేపాకు అంటాము . 4 నుండి 6 మీటర్ల ఎత్తు ఉండే ఈ చెట్టు ఆకులు సువాసన కలిగి ఉంటాయి . వీటి గింజలు (సీడ్స్) విష పదార్ధము కలిగి ఉంటుంది . ఎక్కువగా ఇండియా , శ్రీలంక లలో కనిపిస్తుంది . కూర , చారు , పులుసు వంటకాలలో సువాసనకోసం వాడుతారు
- మధుమేహ తగ్గించే గుణము (anti Diabetic),
- విష పదార్దాల విసర్జనకారిణిగా (anti oxidant),
- సూక్ష్మ క్రిమి నివారిణిగా (anti microbial),
- శరీరమునకు రక్షన ఇస్తుంది (anti inflamatary ),
- కాలేయాన్ని విసతుల్యమవకుండా కాపాడుతుంది(hepatoprotective ),
- కొలెస్టరాల్ ని తగ్గిస్తుంది(anti cholesterolemic) ,
- కరివేపాకు చెట్టులో అన్నిటికీ ఔషధపరమైన ఉపయోగాలున్నాయి. కరివేపాకు ఆకులు, కరివేపాకు కాయలు, వేరు పై బెరడు, కాండం పై బెరడు ఇలా అన్నిటినీ ఔషధ రూపంలో వాడతారు. కరివేపాకు ఒక ప్రధాన ద్రవ్యంగా తయారయ్యే ఆయుర్వేద ఔషధాలు- జాత్యాది తైలం, జాత్యాది ఘృతం. కరివేపాకుతో తయారుచేసుకున్న చూర్ణాన్ని 3-6గ్రాముల మోతాదులో వాడాలి. కరివేపాకు ముదురు ఆకుల్లో ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి. లేత ఆకుల్లో సుగంధిత తైలం ఎక్కువ మొత్తాల్లో ఉంటుంది.
- గర్భిణీ వాంతులు, మార్నింగ్ సిక్‌నెస్, పైత్యపు వాంతులు: కరివేపాకు రసాన్ని పూటకు రెండు టీ స్పూన్ల మోతాదులో, అరకప్పు మజ్జిగకు చేర్చి రెండుపూటలా తీసుకుంటుంటే వికారం, వాంతులు వంటివి తగ్గుతాయి. లేదా తాజా కరివేపాకు రసం ఒక టీ స్పూన్, నిమ్మరసం ఒక టీ స్పూన్, పంచదార ఒక టీ స్పూన్ కలిపి రోజుకు రెండుసార్లు తీసుకుంటుంటే వేవిళ్లలో ఉపశమనం కలుగుతుంది.
- అధిక రక్తపోటులో కనిపించే ఉపద్రవాలు: కరివేపాకు పళ్లను లేదా కరివేపాకు చెట్టు బెరడును కషాయంగా కాచి తీసుకుంటే అధిక రక్తపోటు వల్ల వచ్చే రుగ్మతలు తగ్గుతాయి.
- దురదలు: ఎండబెట్టిన కరివేపాకును, పసుపును సమపాళ్లలో తీసుకొని పొడిమాదిరిగా నూరి, వస్తగ్రాళితం పట్టి ఒక శుభ్రమైన గాజు సీసాలో నిల్వచేసుకొని ప్రతిరోజూ ఒక టీ స్పూన్ మోతాదులో కనీసం మండలంపాటు తీసుకుంటే దురదలు తగ్గుతాయి.
- జ్వరం: కరివేపాకు ఆకులతో కషాయం కాచి తీసుకుంటే జ్వరంలో హితకరంగా ఉంటుంది.
- నీళ్ల విరేచనాలు: కరివేపాకులను ముద్దగా నూరి 1-2 టీ స్పూన్ల మోతాదులో అరకప్పు మజ్జిగతో కలిపి రోజుకు 2-3 సార్లు తీసుకుంటే అతిసారంలో హితకరంగా ఉంటుంది.
- కడుపుబ్బరింపు, కడుపులో మంట: కరివేపాకు పొడిని మజ్జిగలో కలిపి తీసుకుంటే కడుపుబ్బరింపు, మంట వంటివి తగ్గుతాయి.
- శ్వాసకోశ వ్యాధులు: కరివేపాకు, మిరపకాయలు, ఉప్పు, ఉల్లిపాయలను కలిపి రోటి పచ్చడి మాదిరిగా చేసుకొని ఆహారంగా తీసుకుంటే జలుబు, దగ్గు, ఉబ్బసం వంటి వ్యాధుల్లో హితకరంగా ఉంటుంది.
- క్యాటరాక్ట్: తాజా కరివేపాకు రసాన్ని కళ్లలో చుక్కల మందులాగా వాడితే క్యాటరాక్ట్ వేగాన్ని ఆలస్యం చేయవచ్చు.
- సౌందర్య సమస్యలు చర్మసంబంధ సమస్యలు: కరివేపాకు, వేపాకులు సమపాళ్లలో తీసుకొని ముద్దగా నూరి ప్రతిరోజూ రెండుపూటలా పూటకు ఒక టీ స్పూన్ మోతాదుగా, అర కప్పు మజ్జిగతో తీసుకుంటుంటే చర్మసంబంధ సమస్యల్లో హితకరంగా ఉంటుంది.
- కంటి కింద వలయాలు: కరివేపాకు రసాన్ని పెరుగుతో గాని లేదా వెన్నతోగాని కలిపి కళ్లకింద చర్మంమీద రాస్తుంటే క్రమంగా కంటి కింద వలయాలు తగ్గుతాయి.
- పాదాల పగుళ్లు: కరివేపాకు, గోరింటాకు, మర్రిపాలు సమపాళ్లలో తీసుకొని ముద్దగా నూరి పాదాల పగుళ్లమీద వారం పది రోజులపాటు రాత్రిపూట రాసుకుంటే పాదాల పగుళ్లు తగ్గుతాయి. చుండ్రు: కరివేపాకు, నిమ్మ పండ్లపై నుండే తోలు, శీకాయ, మెంతులు, పెసలు... వీటిని సమభాగాలు తీసుకొని మెత్తని పొడి రూపంలో నూరి, నిల్వచేసుకొని షాంపూ పొడిగా వాడితే చుండ్రు నుంచి ఉపశమనం లభిస్తుంది.
- కురుల ఆరోగ్యానికి తల నూనె: కరివేపాకును ముద్దగా నూరి, ఒకటిన్నర రెట్లు కొబ్బరి నూనె కలిపి, చిన్న మంట మీద మరిగించి, వడపోసుకొని నిల్వచేసుకోవాలి. దీనిని రోజువారీగా తల నూనెగా వాడుకుంటుంటే జుట్టు నల్లగా నిగనిగలాడుతుంది. ఆరోగ్యంగా పెరుగుతుంది.
- చెమటవల్ల వచ్చే దుర్గంధం: కరివేపాకు పొడిని ఆహారంలో ప్రతిరోజూ మజ్జిగలో కలిపి తీసుకుంటూ ఉంటే చెమటవల్ల వచ్చే చెడు వాసన తగ్గుతుంది.
- కరివేపాకుని కూరల్లో వేస్తే రుచి పెరుగుతుంది. దానిని జుట్టు సంరక్షణ కోసం ఉపయోగిస్తే అందం కూడా పెరుగుతుంది.
జుట్టు బాగా పెరగాలనుకునేవారు కరివేపాకుని నీళ్లల్లో వేసి మరిగించాలి. ఆ నీటిని మాడుకీ, వెంట్రుకలకీ తగిలేలా మర్దన చేసుకోవాలి. పావుగంట తరవాత మామూలు నీళ్లతో స్నానం చేయాలి. ఇలా తరచూ చేస్తుంటే జుట్టు పెరుగుదల బాగుంటుంది.
కరివేపాకు పేస్టుకి కొంచెం పెరుగు కలిపి దాన్ని హెయిర్ మాస్క్‌లా తలకు పెట్టుకోవాలి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తే జుట్టు ఎదుగుదల బాగుంటుంది.
- -------------------------------------------------
ఆయుర్వేద వివరణ బాగుంది.వనమూలికల గురించి కూడా తెలిపితే బాగుంటుంది.నాకు తెలిసినన మూలికల గురించీ తెలపాలను కుంటున్నానను.మూలశంక గురించిన వైద్యం తెలుసు ౫రోజులలో తగ్గుతుంది
ReplyDeleteఆయుర్వేద వివరణ బాగుంది.వనమూలికల గురించి కూడా తెలిపితే బాగుంటుంది.నాకు తెలిసినన మూలికల గురించీ తెలపాలను కుంటున్నానను.మూలశంక గురించిన వైద్యం తెలుసు ౫రోజులలో తగ్గుతుంది
ReplyDeleteమూలశంక..గుదము వద్ద వాపు రక్తము పడుట మలబద్దకము నొప్పి ఉన్నట్లయితే గడ్డిచామంతి ఆకు గుప్పెడు 5మిరియాలు చెంచాడు పటికబెల్లం పొడి కలిపి మిక్సి లోవేసి అందులో గ్లాసు నీరు కలిపి ఉదయం పరగడుపున 5 రోజులు త్రాగాలి .ఒక గంట వరకు ఏమీ తినరాదు త్రాగరాదు.కొందరికి మలద్వారం వద్ద. పిలకలు ఉండి బాదిస్తాయి వారు గోరింటాకు మెత్తగా నూరి గుదము రంద్రము (భగద్వారం)లో ముద్ద పెట్టి రాత్రి పండుకునే ముందు ...మెడికల్ టేప్ అంటించాలి. అలా 3రోజులు చేస్తే తగ్గి పోతుంది
ReplyDeleteమూలశంక..గుదము వద్ద వాపు రక్తము పడుట మలబద్దకము నొప్పి ఉన్నట్లయితే గడ్డిచామంతి ఆకు గుప్పెడు 5మిరియాలు చెంచాడు పటికబెల్లం పొడి కలిపి మిక్సి లోవేసి అందులో గ్లాసు నీరు కలిపి ఉదయం పరగడుపున 5 రోజులు త్రాగాలి .ఒక గంట వరకు ఏమీ తినరాదు త్రాగరాదు.కొందరికి మలద్వారం వద్ద. పిలకలు ఉండి బాదిస్తాయి వారు గోరింటాకు మెత్తగా నూరి గుదము రంద్రము (భగద్వారం)లో ముద్ద పెట్టి రాత్రి పండుకునే ముందు ...మెడికల్ టేప్ అంటించాలి. అలా 3రోజులు చేస్తే తగ్గి పోతుంది
ReplyDelete