Monday, August 10, 2009

కొబ్బరి , Coconut

కొబ్బరి:

  • - ప్రాచీన కాలం లో విశ్వమంతటా ఆరోగ్య పరిరక్షణకు వాడిన సహజ ఫలము కొబ్బరి . నేటి ఆధునిక మేధావి వర్గం కొబ్బరి అనేక ఆరోగ్య సమస్యలకి సమాదానమంటావుంది . సాంకేతికముగా కొబ్బరిని ''కోకోస్ న్యుసిఫేరా (CocosNeucifera)'' అంటారు . నుసిఫెర అంటే పొత్తుతో కూడుకున్నదని అర్ధము (Nutbearing) ప్రపంచము లో మూడవ వంతు జనాబా వాళ్ల ఆహారములోను ,ఆర్ధిక సంపత్తులోను, ప్రతి పూజా-పవిత్ర కార్యక్రమములోను చాల భాగము కొబ్బరితోనే ముడిపడి ఉన్నది . కొబ్బరికాయను అందరూ శుభప్రదముగా భావిస్తారు. మనదేశములో శుభకారార్యాలకు కొబ్బరికాయ తప్పనిసరి. కొబ్బరికాయ లేని పండుగ లేదంటే అతిశయోక్తి కాదు. కేరళీయులకైతే రోజూ అన్నింటిలోనూ కొబ్బరికాయ ,కొబ్బరినూనె తప్పనిసరిగా వుండి తీరవలసినదే . వారి ఆరోగ్యమూ ,సంపదా కొబ్బరిపంట మీద అదారపడివున్నాయి . కోట్లాదిమంది జనం కొబ్బరిపంటనే జీవనాదారం చేసుకుని వుంటున్నారు . కొబ్బరికాయలో నలబైతొమ్మిది శాతం లారిక్ యాసిడ్ వుంటుంది . ఇది తల్లి పాలకు దాదాపు సరిసమానం అంట. కొబ్బరినూనెలో వుండే పాటియాసిడ్స్, వైరల్ ,ఫంగల్ ,బ్యాక్టీరియల్ వంటి మానవజాతి ఎదుర్కునే రుగ్మతలను తగ్గించడములో సహాయపడతాయి. పోషకాలతో కూడిన ఆహారాన్ని ,పానీయాన్ని అందిచడముతో పాటు ఆరోగ్యాన్ని కలిగిస్తుంది . కొబ్బరిచెట్టు లో ప్రతీ భాగము అన్నిరకాలగాను ఉపయోగపడుతొంది . అందుకే దీనిని మానవుల పాలిట కల్పవృక్షము అంటారు . మీకు తెలుసా ? కొబ్బరికాయకు కూడా ఒక రోజు ఉందని .అదే ప్రపంచ శ్రీ ఫల దినోత్సవము (కోకోనట్ డే)ప్రతీ సంవత్సరము సెప్టెంబర్ రెండు న జరుపుతారు . 

  కొబ్బరి నీరు :
  • ఏ ఋతువులో అయిన తాగదగినవి కొబ్బరి నీరు . లేత కొబ్బరి నీటి లో కార్బోహైడ్రేట్స్ తక్కువ గాను, క్రొవ్వులు అస్సలుండవు ,చెక్కెర పరమితం గాను ఉండును . కొబ్బరి బొండం నీటి లో పొటాసియం ఎక్కువగా ఉంటుంది . శరీరములో నీటి లేమిని (Dehydration) కరక్ట్ చేస్తుంది . వైద్య పరంగా :
  • జీర్ణకోశ బాధల తో బాధపడే చిన్నపిల్లలకు కొబ్బరి నీరు మంచి ఆహారము ,
  • విరోచనాలు అయినపుడు (diarrhoea)ఓరల్ రి-హైద్రాషన్ గా ఉపయోగపడుతుంది ,(Oral re-hydration),
  • పొటాసియం గుండె జబ్బులకు మంచిది ,
  • వేసవి కాలములో శరీరాన్ని చల్లబరుస్తుంది ,
  • వేసవిలో చెమట కాయలు , వేడి కురుపులు , అమ్మవారు జబ్బు పొక్కులు తగ్గేందుకు కొబ్బరినీతిని లేపనం గావాడాలి .
  • కొన్ని రకల పొట్టపురుగులు కొబ్బరి నీటివల్ల చనిపోతాయి,,
  • ముత్రసంభందమైన జబ్బులలోను , కిడ్నీ రాళ్ళు సమస్యలలో ఇది మంచి మందు గా పనిచేస్తుంది .
  • మినెరల్ పాయిజన్ కేసులలో పాయిజన్ ని క్లియర్ చేస్తుంది.
కొబ్బరి పాలు :
  • పచ్చికోబ్బరిలో పోషక విలువలు అధికము . . కొబ్బరి నీళ్లు , పాలు మంత్ర జలం లా పనిచేస్తాయి. దీనిలో విటమిన్ ఎ,బి , సి, రైబోఫ్లెవిన్ , ఐరన్ , కాలసియం ,
ఫాస్పరస్ , కార్బోహైడ్రేట్లు ,కొవ్వు ,ప్రోటీన్లు సమృద్ధి గా లభిస్తాయి , కొబ్బరి కాయ ముదిరిపోయక లోపల పువ్వు వస్తుంది ... అది గర్భాశాయానికి మేలు చేస్తుంది .బాలింతలము అధిక రక్తస్రావము ఇబ్బందింది పెడుతుంటే కొబ్బరి పువ్వు జ్యూస్ ను తీసుకుంటే సత్వర ఉపశమనం దొరుకుతుంది . నిత్యం కొబ్బరి నీళ్లు తాగితే మూత్రపిండాల సమస్యలు దరిచేరవు .శరీరానికి చల్లదనం లభిస్తుంది గొంతు మంట , నొప్పిగా ఉన్నప్పుడు కొబ్బరిపాలు తాగితే తగ్గుతుంది .

  • కొబ్బరి నూనె


















  • కొబ్బరి నూనెలో యాబై శరము లారిక్ ఆసిడ్ ఉంటుంది ...దీన్ని వంటల్లో అధికము గా ఉపయోగిస్తే గుండెకు రక్తప్రసరణ సక్రమము గా జరుగుతుంది .
  • కొవ్వు శాతము పెరగదు ,
  •   రక్తపోటు నియంత్రణలో ఉంటుంది . 
  • కొబ్బరి నూనే లో విటమిన్ 'ఇ ' అధికము... ఇది చర్మాన్ని కొమలముగా తాయారు చేస్తుంది. 
  • రోజూ రెండు చెంచాలు నూనే తీసుకుంటే జీర్ణ వ్యవస్తకు మంచిది . . థైరాయిడ్ సమస్యలూ ఉండవు .
  • అందానికి : పొడి చర్మము ఉన్నవారు పచ్చికొబ్బరి తీసుకుంటే శరీరానికి సరిపడా తేమ అందుతుంది , 
  • కొబ్బరి పాలు చర్మానికి పట్టిస్తే మృతకనాలు , మురికి తొలగిపోతాయి . మేని ప్రకాశవంతము గా మెరుస్తుంది ... ఇది జుట్టుకు మేలు చేస్తుంది ... కొబ్బరి పాలు తలకు పట్టిస్తే .. . కేశాలు కాంతి వంతము గా తాయారు చేస్తుంది .  

  • కొబ్బరినూనెతో కళ
సహజ సిద్ధమైన కొబ్బరినూనె చర్మానికీ, జుట్టుకీ ఎంతో మేలు చేస్తుంది. అది మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. మేకప్‌ రిమూవర్‌గానూ ఉపయోగించుకోవచ్చు. రోజూ శరీరానికి రాసుకోవడం వల్ల చర్మంపై ఉన్న మచ్చలూ, గీతలూ కొంతకాలానికి తగ్గుముఖం పడతాయి. స్నానానికి ముందు శరీరానికి కొబ్బరి నూనెతో మసాజ్‌ చేసుకుంటే మంచిది. ఒంట్లోని తేమ బయటికి పోకుండా ఉంటుంది. గోరువెచ్చని కొబ్బరి నూనెని తలకి మసాజ్‌ చేసుకుంటే జుట్టు మృదువుగా, కాంతిమంతంగా తయారవుతుంది. జుట్టు నుంచి ప్రోటీన్లు బయటికి పోవడం తగ్గుతుంది. ఇది జుట్టుకి మంచి కండిషనర్‌గా పనిచేస్తుంది. కాలిన గాయాలూ, ఎండ వేడికి కమిలిన చర్మంపై కొబ్బరినూనె రాస్తే త్వరగా తగ్గుతాయి. కనురెప్పలకి రాసే మస్కారా, కాటుక వంటి మేకప్‌ కొబ్బరినూనెలో ముంచిన దూదితో తుడిస్తే సులువుగా పోతాయి
  • ==============================
 Visit my వెబ్సైటు -> dr.seshagirirao

No comments:

Post a Comment