-
- --
- pumpkin Fruit
దీని శాస్త్రీయ నామము "cucurbita pepo
లేదా cucuebita mixta " ,
ఇది ప్రపంచము లో అన్ని దేశాలలో దొరుకు తుంది . గుమ్మడిలో అద్భుత ఔషధాలున్నాయి. గుమ్మడి కాయను భారత సంప్రదాయక వంటకాలలో దీనికి మంచి స్థానమే ఉంది. ఇందులోని పదార్థాలు వివిధ రోగాలను నివారించే గుణం కలిగి ఉండడం విశేషం. మలబద్ధకం మొదలుకుని మధుమేహం వరకూ చాలా విధాల ఉపయోగపడే గుమ్మడిలో నిజంగా గమ్మత్తైనదే. చైనాలో చక్కెర వ్యాధి వలన సంక్రమించే సమస్యల పరిష్కారానికి తయారు చేసే మందుల్లో గుమ్మడిని వాడుతున్నారు.
- ఇందులో చాల ఎక్కువగా "బీటా కెరోటిన్ ఉంటుంది ,
- శరీరానికు తక్కుకా క్యాలరీలు అందిస్తుంది .
- కళ్ళకు ,చర్మానికి ఎంతో మేలు చేస్తుంది .
- ఇందులో విటమిన్ సి కుడా సంవృద్దిగా లభిస్తుంది .
గుమ్మడి కాయ రకరకాల వంటగా చేసుకొని తినవచ్చును ,
జ్యూస్ గా తయారుచేసుకొని తీసుకోవచ్చును ,
సూప్ లా వాడుకోవచ్చు ..
- డయాబెటీస్ రాకుండా ఉండేందుకు , వచ్చిన వారికి కుడా గుమ్మడి ఎంతో మంచిది .
- బి.పి.ని నియంత్రిస్తుంది ,
- పీచు పదార్ధము ఎక్కువగా ఉన్నందున కొలెస్టరాల్ ను తగ్గిస్తుంది ,
- గుమ్మడి విత్తనాలను ఎండబెట్టి పొడిచేసి నీళ్ళలో కలిపి తాగితే మూత్ర సంభంద వ్యాదులు తగ్గుతాయి .
ఆహారం ద్వారా శరీరంలోకి చేరే కొవ్వును పేగులు గ్రహించకుండా చేయడం ద్వారా కొవ్వు నిల్వలను గణనీయంగా తగ్గించవచ్చు. ఇలా దేహంలో కొవ్వు చేరకుండా కాపాడుకోవాలంటే గుమ్మడి గింజలు తినడం మంచిదని ఆయుర్వేదం చెబుతోంది. గుమ్మడి గింజల్లో ఉండే ఫైటోస్టెరాల్ నిల్వలు కొవ్వు నిల్వలను పోలి ఉంటాయి. ఈ కారణంగా గుమ్మడి గింజలను ఆహారంగా తీసుకున్న వారిలో అవి జీర్ణమైన తర్వాత పేగులు ఈ ఫైటోస్టెరాల్ నిల్వలను కూడా గ్రహిస్తాయి. దీనివల్ల శరీరంలోకి చేరాల్సిన కొవ్వు శాతం బాగా తగ్గుతుంది.
ఇలా గుమ్మడితో లాభాలతో పాటు విటమిన్-ఇ, ఒమెగా-3 కొవ్వు ఆమ్లాలు, మెగ్నీషియం, ఫోలేట్ లాంటి శరీరానికి మేలు చేసే పోషకాలు కూడా లభిస్తాయి. అందుకే కొవ్వు సమస్యతో బాధపడేవారు తమ ఆహారంలో గుమ్మడి గింజలు ఉండేలా చూచుకుంటే మంచిది. వీటిలో మెగ్నీషియం మెండుగా వుంది. ఇంకా మినరల్స్ అత్యధికంగా పోగుపడ్డ గింజలు. అంతేకాదు వీటికి ఆహారంలో భాగస్వామ్యం కల్పిస్తే మన జీవితకాలం మరింత పెరుగుతుందట!
గుమ్మడి ప్రొస్టేట్ గ్రంథుల వాపును తగ్గించడానికి వైద్య పరంగా గుమ్మడి కాయ సరిపోతుంది. గుమ్మడి విత్తనాలు తినడం వలన మలబద్ధకం నివారణ ఆవుతుంది. ఆహారం పూర్తిగా జీర్ణమై మలబద్ధక సమస్య తీరుతుంది. తరచూ గుమ్మడిని తీసుకోవడం వలన గ్యాస్ట్రిక్ నుంచి ఉపశమనం లభిస్తుంది.
అలాగే ఛాతీ నొప్పి, ఊపిరితిత్తుల క్యాన్సర్లు వచ్చే అవకాశాలు తగ్గుతాయని పరిశోధకులు చెబుతున్నారు. గుమ్మడి తీసుకోవడం వలన చక్కెర వ్యాధిగ్రస్తులకు రకరకాల ఉపయోగాలున్నాయి. రక్తంలోని గ్లూకోజ్‌ను బాగా తగ్గిస్తుంది. పైగా గింజల నుంచి తీసే నూనె వాడడం వలన అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది.
-
ఆయుర్వేదములో గుమ్మడి :
గుమ్మడికాయ పండినది:-Pumpkin-ripe బాగుగా ముదిరిన, పండిన గుమ్మడి కాయ వండిన మధురముగ నుండును. రుచిబుట్టించును. దేహ పుష్టి, బలము, వీర్యవృద్ధి, మేహశాంతి, దాహము, తాపము, కడుపుబ్బు లను తగ్గించును.
దుష్టరక్తమును బుట్టించును. అలస్యముగ జీర్ణమగును; వాతము జేయును; దీనికి విరుగుళ్ళు 1 శొంఠి, 2 కాక ఔషధములు, 3 కానుగ వేరు రసము. ఔషధ సేవలో పథ్యమైన వస్తువు.
గుమ్మడి కాయ లేతది:- Pumpkin-tender. దీని కూర మిక్కిలి వాతము, రక్త పైత్యము, అగ్నిమాంద్యము జేయును; దుర్బల దేహులు, రోగులు దీనిని పుచ్చుకొనగూడదు; మిక్కిలి అపథ్యమైనది. దీనికి విరుగుళ్ళు గుమ్మడి కాయ ముదిరినది చూడుడు.
గుమ్మడి పువ్వులు :-Flowers of pumpkin plant. పైత్యమును, సన్నిపాతములను హరించును; వీనిని కూరవండుదురు.
గుమ్మడికొసల కూర :-Curry of the tender leaves of pumpkin plant. తియ్యగుమ్మడి తీగె కొసలు అనగా లేత ఆకుల కూర ఆమదోషము, వాతము, గుల్మము, జ్వరము, ఉబ్బు, విదాహము వీని నణచును; జఠరదీప్తి నిచ్చును.
-- Dr.Seshagiriao MBBS (Srikakulam)
No comments:
Post a Comment