Monday, August 10, 2009

దానిమ్మ , Pomegranate

దీని శాస్త్రీయ నామము " punica granatum". పండ్ల జాతులలో మేలైనది . తినడానికి రుచిగా ఉంటుంది . దీనిలో విటమిను -ఎ,సి, ఇ ,బి5, flavanoids ఉన్నాయి .

పండే- బంగారంగా చెట్టే- ఔషధంగా చెప్పే దానిమ్మ ప్రయోజనాలు ఎన్నెన్నో. రక్తశుద్ధికి దానిమ్మను మించింది లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ రోజూ కాసిని దానిమ్మ గింజలు తింటే ఎంతో మేలు. చైనాలో దానిమ్మ మొక్క లేని ఇల్లు ఉండదు. ఈ చెట్టు ఉంటే ఓ చిన్న డిస్పెన్సరీ ఉన్నట్లే భావిస్తారు. దానిమ్మలో ఉండే శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్లంటే రక్తంలోని కొలెస్ట్రాల్‌కి చాలా భయం. అందుకే హృద్రోగులకి ఇది చాలా మంచిది. డయాబెటిస్‌, ఆస్టియో ఆర్త్థ్రెటిస్‌... వంటి వ్యాధుల్ని నివారించడంలో దీన్ని మించింది లేదు. కడుపులో మంటనీ, జ్వరాల్నీ, గొంతు, నోటి సమస్యల్నీ తగ్గిస్తుంది.

పోషకాలు
వంద గ్రా. దానిమ్మ గింజల్లో
శక్తి: 83 క్యాలరీలు
పిండి పదార్థాలు: 18గ్రా.
పీచు: 4 గ్రా.
కొవ్వులు: 1.17గ్రా.
ప్రొటీన్లు: 1.67గ్రా.
సి-విటమిన్‌: 10.2 గ్రా.
కాల్షియం: 10 మి.గ్రా.
మెగ్నీషియం: 12 మి.గ్రా.,
ఫాస్ఫరస్‌: 36 మి.గ్రా.
పొటాషియం: 259 మి.గ్రా.
  • గింజలు ఒలుచుకుని తినడం కొద్దిగా కష్టం కానీ, దానిమ్మ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఎర్రగా నిగనిగ లాడుతూ కంటికి ఇంపుగా కనిపించేదానిమ్మ గింజలు ఆరోగ్యానికి అనేక విధాలుగా ప్రయోజనం కలిగిస్తాయి . పండులోని " ఇల్లాజిక్ యాసిడ్ " ను చర్మం పై రాస్తే సూర్యకిరణల తాలూకు ప్రభావము నుంచి రక్షింస్తుంది . ఈ కిరణల తాకిడివల్ల చర్మం లోని కొలాజెన్‌ తగ్గిపోతుంది . దీని ఫలితంగా చర్మం ముందే వార్ధక్యా నికి లోనై ముడతలు పడుతుంది .
* అత్యంత శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్ల సమాహారం దానిమ్మ. ఇవి కణాల విధ్వంసానికి కారణమయ్యే ఫ్రీరాడికల్స్‌ పని పట్టి వృద్ధాప్యాన్ని దూరం చేస్తాయి. అల్జీమర్స్‌, వక్షోజ క్యాన్సర్‌, చర్మ క్యాన్సర్లను అడ్డుకుంటాయి.
  • * దానిమ్మ సహజ యాస్పిరిన్‌. రక్తసరఫరాను తగినంతగా వేగవంతం చేస్తుంది. పావు కప్పు రసం రోజూ తాగితే మీ గుండె ఎంచక్కా భద్రంగా బీరువాలో ఉన్నట్టే.
* ఎముకల ఆరోగ్యానికి కూడా దానిమ్మ చాలా మంచిది. ఆస్టియోఆర్థ్రయిటిస్‌తో బాధపడేవారికి అత్యంత రుచికరమైన మందు దానిమ్మ పండు, రసం.
  • * సహజ ఆస్ప్రినే కాదు... దానిమ్మ ప్రకృతి మనకు అందించిన సహజ వయాగ్రా కూడా. దానిమ్మ రసం రక్తాన్ని ఉరకలు వేయిస్తుంది. అంగస్తంభన సమస్యలతో బాధపడేవారికి సరైన ఔషధం. సంతాన సాఫల్యతను పెంచే శక్తీ ఉంది దీనికి.
* గర్భస్థశిశువుల ఎదుగుదలకు అత్యవసరమైన ఫోలిక్‌ యాసిడ్‌ ఈ పండులో పుష్కలంగా లభిస్తుంది. గర్భిణులు రోజూ ఒక గ్లాసు దానిమ్మ రసం తాగితే మంచిది. దీనివల్ల నెలలు నిండకుండానే ప్రసవం అయ్యే ముప్పు కూడా తప్పుతుందని ఒక అధ్యయనం.
  • * వయసు పెరిగే కొద్దీ ఏర్పడే ముడతలను కూడా నివారిస్తుంది దానిమ్మ రసం. నీళ్లవిరేచనాలతో బాధపడేవారికి మంచి మందు ఇది.
* ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ వైరల్‌ గుణాలు నోటి పూతనుంచి ఉపశమనాన్ని కలుగజేస్తాయి. అల్సర్లను నివారిస్తాయి. దంతాల చిగుళ్లను బలపరుస్తాయి.
  • * రుతుస్రావ సమయంలో ఉండే ఇబ్బంది, ఒత్తిడి వంటి సమస్యలకు విరుగుడు దానిమ్మ రసం.
దానిమ్మ రసము అంగసంభాన సమస్యలను నివారిస్తుంది ... శృంగార ప్రేరితంగా పనిచేస్తుంది .
  • గుండె (హృదయము) కు మేలు చేస్తుంది .
దానిమ్మ రసములోని రసాయనాలు 'కొలెస్టరాల్ ' వల్ల జరిగే ప్రమాదాల జోరును తగ్గిస్తుంది .
  • రక్తపోటును తగ్గించే గుణము దీనికి ఉంది - inhibit the angiotenson converting enzyme .రక్తనాళాలు ముసుకుపోయే గుణము నుండి రక్షిస్తుంది .
  • ఫ్లవనోయిడ్స్ వలన కాన్సర్ వ్యాధి వచ్చే అవకాసము తగ్గుతుంది .
  • దానిమ్మ గింజల ,నూనె ... రొమ్ము కాన్సర్ అదుపుచేయు లక్షణము కలిగివుంది .
వారానికోసారి దానిమ్మ రసము :
  • అధికరక్తపోటు తో బాధపడు తున్నా లేక ట్రైగ్లిసరైడ్స్ 100 దాటి వున్నా లేదా గుండెను కాపాడే ''హెచ్.డి.ఎల్. కొలెస్టిరాల్ '' 50 కన్నా తక్కువగా ఉన్నా... ప్రతివారము ఒకసారి గ్లాసు దానిమ్మరసము తాగడము మంచిది. . గుండెజబ్బులున్నవారికి మేలు చేస్తుంది . మూత్రపిండాల సమస్యలున్నవారికి బాధలను నివారిస్తుంది. దానిమ్మగింజలు నోటిలో వేసుకుని నమలడము కన్న దాన్ని రసము తీసుకొని తాగడము మేలు ... మంచిది .
  • ============================
visit my website : Dr.Seshagirirao-MBBS

No comments:

Post a Comment