Monday, August 10, 2009

పాప్ కారంస్ , Popcorns

మొక్కజొన్న తేలికగా జీర్ణమయ్యే ఆహారము . మొక్కజొన్న గింజలు ఒక మంచి బలమైన ఆహార పదార్ధము. దీని గింజలను పచ్చిగా గాని, కాల్చుకొని లేదా ఉడకబెట్టుకొని తింటారు. మొక్కజొన్న గింజలనుండి పేలాలు 'పాప్ కార్న్', 'కార్న్ ఫ్లేక్స్' తయారుచేస్తారు. లేత 'బేబీకార్న్' జొన్న కంకులు కూరగా వండుకుంటారు. మొక్కజొన్న పిండితో రొట్టెలు చేసుకుంటారు. మొక్కజొన్న గింజలనుండి నూనె తీస్తారు. దీనిలో ఉండే "పాలిఫెనాల్స్(polyphenaols)"మంచి యాంటి ఆక్షిదేంట్ గా పనిచేస్తుంది . ఇది కాన్సర్ ,గుండె సంభంద సమస్యలు దరి చేరకుండా చూస్తుంది . రక్త కానాల క్షీనత కు కారణమయ్యే ఫ్రీ రాదికాల్స్ ను నశింపచేయడం లో బాగా ఉపయోగ పడుతుంది . దీనిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది -- మలబద్దకం ను నివారిస్తుంది . కాలరీస్ చాల తక్కువ -- కడుపు నింపుతుంది కాని శరీరాన్ని పెంచదు . కొవ్వు శరము చాల తక్కువ -- ఉఉబకాయము రానివ్వదు , అసలు సోడియం ఉండదు -- రక్తపోటు వచ్చే అవకాసము లేదు , ఇది షుగర్ ఫ్రీ --- మధుమేహ వ్యాధిగ్రస్తుల కు చాల మంచిది .

No comments:

Post a Comment