skip to main |
skip to sidebar
బార్లీ - Barli
- బార్లీ ఒక రకము గడ్డి జాతి పంట . బార్లీ గింజలు ఆహారము గాను , ఔషదము గానూ ఉపయోగపడుతుంది . బార్లీలో శక్తి మధ్యస్తంగా ఉంటుంది. మాంసకృత్తులు కూడా మధ్యస్తంగా ఉంటాయి. కొవ్వు తక్కువ. సంతృప్త కొవ్వు తక్కువ. కొలెస్టరాల్ ఉండదు. పిండి పదార్థాలు ఎక్కువ. పీచు పదార్థాలు ఎక్కువ కనుక అరుగుదలకు మంచిది. ఒక కప్పు ఉడికించిన బార్లీలో 4.5 గ్రాముల పీచు పదార్థం ఉంటుంది. అలాగే 12.5 మిల్లీగ్రాముల ఫోలేట్ ఉంటుంది. ఇది పెద్దలకు రోజుకు అవసరమైన ఫోలేట్ మోతాదులో 3 శాతం. బార్లీలో సోడియం తక్కువ కనుక రక్తపోటు భయం ఉండదు. బార్లీలో బి-విటమిన్లు, ఫోలేట్ ఎక్కువగా ఉంటాయి. అలాగే లోహం, పొటాషియం వంటి ఖనిజ సంపద పదార్థాలు అధికంగా ఉంటాయి. అయితే బార్లీలో లైసిన్ అనే ఎమైనో యాసిడ్ ఉండదు.
ఉపయోగాలు :
- బార్లీని కాల్షియం పదార్థాలతోను, చిక్కుళ్లు, మాంసం, పాలు, కోడిగుడ్లు వంటి వాటితో కలిపి తీసుకుంటే మంచిది. వీటిని కలిపి తీసుకోవటం ద్వారా బార్లీలో లేని లైసిన్‌ని భర్తీచేసినట్లవుతుంది.
- బార్లీలో జిగురు ఎక్కువ కనుక గ్లూటెన్ పదార్థాలతో ఎలర్జీ కలిగినవారు బార్లీని తీసుకోకూడదు.
- బార్లీని గాలి చొరబడని, తేమలేని డబ్బాల్లో చల్లగా, చీకటిగా, పొడిగా ఉండే జాగాలో నిల్వచేస్తే పోషక తత్వాలు దెబ్బతినకుండా కొన్ని నెలలపాటు తాజాగా ఉంటాయి.
- బార్లీకి నీళ్లు కలిపి ఉడికించినప్పుడు దానిలోని స్టార్చ్ రేణువులు నీటిని పీల్చుకొని మెత్తబడి ఉబ్బుతాయి. బార్లీని 140 డిగ్రీల ఫారిన్ హీట్‌కి మించి వేడి చేస్తూపోతే స్టార్చ్ రేణువులు విచ్చేదనం చెంది ఎమైసోడ్ ఎమైలోపెక్టిన్‌లు చుట్టుపక్కలకు తప్పించుకొని నీటి రేణువులు తమలో కలిపేసుకుంటాయి. ఈ కారణం చేతనే పల్చని సూప్‌కి బార్లీగింజలను కలిపితే చిక్కగా తయారవుతుంది.
- బార్లీలో ఉండే విటమిన్-బి నీటిలో కరిగే తత్వం కలిగినది. దీనిని వృధాగా పోనివ్వకూడదనుకుంటే బార్లీగింజలను, వాటిని వేసి ఉడికించిన నీళ్లతో సహా తీసుకోవాలి.
- పియర్లింగ్ అనే ప్రక్రియలలో, బార్లీగింజలపైనుండే పొరను తొలగిస్తారు. బార్లీగింజలను పిండిగా మరాడించినప్పుడు పైనుండే ఊకను లేదా తవుడును తొలగిస్తారు. అయితే బి-విటమిన్లు, పీచు పదార్థాలు వంటివి అత్యధిక భాగం పై పొట్టులోనే ఉంటాయి కాబట్టి బి విటమిన్ కావాలనుకునేవారు బార్లీగింజలను యధాతథంగా వాడగలిగితేనే మంచిది.
- మాల్టింగ్ అనే ప్రక్రియలో బార్లీ గింజలను మొలకెత్తేలా చేస్తారు. ఈ ప్రక్రియలో సంక్లిష్ట పిండి పదార్థాలు (బీటాగ్లూకాన్స్) షుగర్స్‌గా మారతాయి. ఇలా సిద్ధంచేసిన మాల్టెడ్ బార్లీ గింజలను బీర్, విస్కీ వంటి పులియబెట్టి చేసే పదార్థాల తయారీకి వినియోగిస్తారు.
- బార్లీని నీళ్ళలో నానవేసి రోజూ తాగితే శరీరానికి పట్టిన నీరు తగ్గుతుంది. అలాగే ఒంటికి నీరు చేరిన గర్భిణి స్త్రీలు బార్లీ నీటిని తాగడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇంకా అనారోగ్యంతో బాధపడేవారు ప్రతీరోజూ బార్లీ గంజిని తాగితే బలహీనత, నీరసం తగ్గి నూతన శక్తి లభిస్తుంది.
బార్లీని రవ్వలాగా, మెత్తటి పిండిలా చేసి దానితో ఫలహారాలను చేసి తింటే త్వరగా, తేలిగ్గా జీర్ణమవుతాయి. బార్లీ నుండి తీయబడిన నూనెను వాడితే శరీరంలోని కొలెస్టరాల్ శాతం తగ్గుతుంది.
బార్లీలో ప్రోటీన్లు, కార్పోహైడ్రేడ్లు, కొవ్వు, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా లభిస్తాయి. పిల్లలకు ఇచ్చే సూప్‌లలో, పాలలో బార్లీ వాడటం ద్వారా వారి ఎదుగుదలకి ఆరోగ్యానికి, శక్తికి దోహదం చేస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
వైద్యపరమైన ఉపయోగాలు
- కొలెస్టరాల్: బార్లీలో ఉండే జిగురు పదార్థాలు, పెక్టిన్ పదార్థాలు రక్తంలో సంచరించే కొలెస్టరాల్ మొత్తాలను తగ్గిస్తాయి. బార్లీలోని పెక్టిన్ జిగురుగా తయారై, మన ఆమాశయంలోని కొవ్వు పదార్థాలను బంధించి శరీరం గ్రహించనివ్వకుండా చేస్తుంది. మన పేగుల్లో నివసించే బ్యాక్టీరియా బార్లీలోని బీటాగ్లూకాన్స్‌ను వినియోగించుకొని ఫ్యాటీయాసిడ్స్‌గా మారి కాలేయంలో కొలెస్టరాల్‌ని తయారవ్వకుండా చేస్తాయి. బార్లీలో ఉండే టోకోట్రయినాల్ అనే పదార్థంకూడా కొలెస్టరాల్ తయారీని అడ్డుకుంటుంది.
- జీర్ణావయవాల పనితీరు మందగించటం: పావు కప్పు బార్లీ గింజలను రెండున్నర లీటర్ల నీళ్లకు కలిపి సగం నీళ్లు మిగిలేంతవరకూ మరిగించి, దించి వడపోసుకొని తాగాలి. ఇలా రెండురోజులపాటు చేస్తే పేగుల పనితీరు మెరుగవుతుంది.
- జ్వరం: వాపులతో కూడిన జ్వరాల్లో బార్లీని ఆహారౌషధంగా వాడవచ్చు. చిన్న పిల్లలకు బార్లీని పాలతోగాని లేదా పండ్ల రసంతో గాని కలిపి ఇవ్వవచ్చు. జ్వరంలో నీరసం ఉంటే బార్లీ కషాయానికి గ్లూకోజ్ కలిపి తీసుకుంటే వెంటనే శక్తి వస్తుంది.
- మూత్రమార్గ సంబంధ సమస్యలు: బార్లీ గింజలతో గంజిని తయారుచేసి, మజ్జిగను, నిమ్మరసాన్ని కలిపి తీసుకుంటే మూత్ర సంబంధ వ్యాధుల్లో అద్భుతమైన ఫలితం కనిపిస్తుంది. మూత్రం జారీ అవటంవల్ల శరీరంలో వాపు దిగుతుంది. ఇది నెఫ్రైటిస్, సిస్టైటిస్ వంటి సమస్యల్లో సైతం ఉపయుక్తంగా ఉంటుంది. మూత్ర విసర్జన కష్టంగా ఉంటే బార్లీ కషాయానికి బెల్లం, నిమ్మరసం కలిపి తీసుకోవచ్చు.
- తల్లిపాలు పెరగటంకోసం: బాలింతల్లో తల్లిపాలు తక్కువగా పడితే బార్లీని పాలతో కలిపి తీసుకుంటే హితకరంగా ఉంటుంది.
- ==========================
Visit my Website -
Dr.Seshagirirao
Dr.Vanadan garu
ReplyDeleteLots of thanks for providing inf on Barli, I do drink alcoholic beer to be frank with you, I am 64 yrs, no issues so far,
Kind regards