- దోస (cucumber)
శాస్త్రీయ నామం - కుకుమిస్ సటైవస్ (Cucumis sativus), కుకుర్బిటేసి (cucurbitaceae) కుటుంబానికి చెందినవి. దోస ఈ దేశమున ప్రాచీన కాలము నుందియూ సాగునందుండిన తీగ జాతి చెట్టు. రకములు 1. దేశవాళీ దోస--12 - 15 సెం.మీ పొడవు ఉంటుంది. 7 -10 సెం.మీ లావును కలిగి ఉంటుంది. సుమారుగా అర కేజీ నుండీ కేజీ వరకు ఉంటుంది. పండిన తరువాత పసుపు పచ్చగా ఉంటాయి. 2.నక్క దోస--చిన్న కాయలు, 5 - 10 సెం.మీ. పొడవు, 4 - 8 సెం. మీ లావు కలిగి ఉంటాయి. 3.ములు దోస 4.పందిరి దోస 5.బుడెం దోస కాయలు కీర దోసకాయ చూడ్డానికి పొడవుగా ఉంటుంది. గింజలు తప్పెటగా ఉంటాయి. దీనిని మన ప్రాంతాల్లో వ్యవసాయ మొక్కగా పండిస్తారు. * కీర మొక్కలో ఔషధంగా ఉపయోగించదగిన భాగాలు- కాయ, గింజలు, వేర్లు.
- ఔషధ ఉపయోగాలు :
- ఔషధంగా వాడాల్సిన గింజల పొడి 3-5గ్రాములు, కాయ రసం 25- 50 మిల్లీలీటర్లు.
- కీర దోసలో శక్తి చాలా తక్కువ. ప్రోటీన్ మద్యస్తంగా ఉంటుంది. కొవ్వు చాలా తక్కువ. ముఖ్యంగా సంతృప్త కొవ్వు పదార్థం బాగా తక్కువ. కొలెస్టరాల్ ఉండదు. పిండి పదార్థాలు ఎక్కువ. పీచు పదార్థాలు, సోడియం తక్కువగా ఉంటాయి. విటమిన్లలో విటమిన్-సి, ఖనిజ సంబంధ పదార్థాల్లో లోహం, పొటాషియం ఎక్కువ మొత్తాల్లో ఉంటాయి. కీర దోసలో తొంభై ఆరు శాతం నీరే ఉంటుంది. దీనిలోని పీచు పదార్థం 30రెట్లు నీటిని ఆకర్షించి నిల్వచేస్తుంది. గోధుమల్లో పీచు పదార్థాలు వాటి బరువులో కేవలం నాలుగైదు రెట్లు నీటిని మాత్రమే గ్రహిస్తాయి. దోసకాయ పీచులోని ఈ తత్వంవల్ల విటమిన్లు వంటి ఇతర పోషక తత్వాలకు గానీ, కనీసం పీచు పదార్థాలకు గానీ అవకాశం ఉండదు. కేవలం కడుపునింపుకోవడానికి ఇది ఉపకరిస్తుంది.
- జ్వరం, జ్వరంతోపాటు చలి: కీరదోస రసాన్ని తీసుకున్న తరువాత మంటల సెగ తగలనిస్తే జ్వరం దిగుతుంది.
- మూత్రం అడ్డుకుపోవటం: మూత్ర విసర్జన కష్టంగా ఉన్నప్పుడు కీరా దోసకాయ గింజలను 10గ్రాముల మోతాదులో తీసుకొని మెత్తగా పొడిచేసి, పుల్లని గంజితో కలిపి, ఉప్పుచేర్చి తీసుకుంటే ఎంతటి తీవ్రమైన సమస్య అయినప్పటికీ తగ్గిపోతుంది.
- మూత్రం సన్నగా రావటం: కీర దోసకాయ గింజలను పొడిచేసి నువ్వు గింజల పొడి, నెయ్యి, పాల మిశ్రమంతో కలిపి తీసుకుంటే మూత్రం సన్నగా, అడ్డుకుపోయినట్లు రావటం తగ్గుతుంది.
- మూత్ర మార్గంలో రాళ్లు తయారవటం: కీర దోసకాయ గింజలను కొబ్బరి పువ్వులతో కలిపి నూరి, పాలతో సహా కొన్ని రోజులపాటు తీసుకుంటే మూత్ర మార్గంలో ఇసుక మాదిరిగా రేణువులు తయారైనప్పుడు హితకరంగా ఉంటుంది.
- మూత్రంతోపాటు రక్తం పడటం: కీర దోసకాయ రసం, చెరకు రసంకు నేలగుమ్మడి దుంప (విదారి కంద) పొడిని కలిపి తీసుకుంటే మూత్రంతోపాటు రక్తం పడటం ఆగిపోతుంది.
- శరీరాంతర్గతంగా రక్తస్రావమవటం: కీరదోస మొక్క తాలూకు వేరును ముద్దగా నూరి, తేనెతో కలిపి, బియ్యం కడుగు నీళ్లతో తీసుకుంటే శరీరాభ్యంతరంగా రక్తస్రావమటం ఆగిపోతుంది.
- మూత్రాశయంలో రాళ్లు తయారవటంవల్ల మూత్రం అడ్డుకుపోవటం: కీరాదోస గింజల పొడిని ద్రాక్షపండ్ల రసంతో తీసుకుంటే మూత్రం కష్టంగా రావటం అనేది తగ్గుతుంది.
- కడుపునొప్పి (శూల): కీర దోస వేరును నలగ్గొట్టి, పాలకు వేసి కాచి తీసుకుంటే అన్ని రకాల శూలాల్లోనూ (కోలిక్స్) హితకరంగా ఉంటుంది.
- మూత్ర సంబంధ సమస్యలు: కీర దోసను ముక్కలుగా తరిగి పెరుగులో వేసుకొని తినడం గాని లేదా నేరుగా తినడం గాని చేస్తే, మూత్రం జారి అవుతుంది. దీంతో శరీరంలో విష పదార్థాలు పేరుకుపోకుండా ఉంటాయి. దోసకాయ గింజలను ముద్దగా నూరి ప్రతిరోజూ తింటుంటే కూడా ఉపయోగకరంగా ఉంటుంది.
- మూత్రం అడ్డుకుపోవటం: కీర దోసకాయను గుజ్జుగా గ్రైండ్ చేసి, రసం తీసి, దానికి చెంచాడు గ్లూకోజ్, లేదా తేనె, రెండు చెంచాలు నిమ్మరసం కలిపి తీసుకుంటే మూత్రం సాఫీగా వస్తుంది. గర్భధారణ, అధిక రక్తపోటు, జలోదరం వంటి సందర్భాల్లో ఇది చాలా హితకరంగా ఉంటుంది.
- గౌట్, రుమటాయిడ్ ఆర్తరైటిస్: యూరిక్ యాసిడ్ కీళ్లమధ్య పేరుకుపోయి కీళ్ల నొప్పులు వస్తుంటాయి. ఇలాంటి సందర్భాల్లో కీర దోసకాయ రసం తీసుకుంటే యూరిక్ యాసిడ్ స్ఫటికాలు త్వరితగతిన విసర్జితమవుతాయి.
- కళ్ల మంటలు: కీర దోసను ముక్కలుగా తరిగి కళ్లమీద పెట్టుకుంటే కళ్ల మంటలు, సమస్యలు తగ్గుతాయి.
- చర్మసంబంధ సమస్యలు: చర్మంమీద చీము గడ్డలు, పొక్కులు వంటివి తయారయ్యేవారు రోజువారీగా కీరాదోసను తీసుకుంటే ఉపయుక్తంగా ఉంటుంది.
- కాళ్లు, చేతుల్లో మంటలు: కీర దోస రసాన్ని హస్తపాదాలకు రాసుకుంటే మంటలు తగ్గుతాయి.
- మూత్ర పిండాల్లో రాళ్లు: కీర దోస గింజలు, నేల గుమ్మడి రసం, చెరకు రసం కలిపి తాగితే మూత్రమార్గంలో తయారైన రాళ్లు కరిగి పడిపోతాయి.
- కలరా, గనేరియా: కీరదోస ఆకు రసాన్ని కొబ్బరి నీళ్లతో కలిపి తడవ తడవకూ తాగుతుంటే కలరా, గనేరియా వంటి వ్యాధుల్లో ఉపయుక్తంగా ఉంటుంది.
- ======================
Visit my Website - Dr.Seshagirirao
No comments:
Post a Comment