- =======================================
Sunday, March 20, 2011
పేషన్ ఫ్రూట్ , Fashion Fruits
పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....
కొన్ని పండ్ల పేర్లు వింటాం గానీ చూడడం అరుదే. మార్కెట్లో కనిపించినా ఏ కొద్దిరోజులో కనిపించి మాయమైపోతాయి. అలా ఈ వేసవిలోనూ అదీ అరుదుగా మాత్రమే కనిపించే కొన్ని రకాల...పండ్లలో ఫేషన్ ఫ్రూట్ ఒకటి.
చూడ్డానికి నిమ్మపండులా ఉండి నారింజరంగు గుజ్జుతో తియ్యగా పుల్లగా ఇంకా తినాలనిపిస్తుంది. దానిపేరే పేషన్ ఫ్రూట్. ఇటీవల మన పెరటితోటల్నీ అందంగా అల్లుకుంటూ పరిమళభరితమైన రసమాధుర్యంతో వేసవి దాహార్తిని తీరుస్తుంది. దీని పండ్లు పసుపు, వూదా రంగుల్లో ఉంటాయి. పండులోని నల్లని గింజలు సబ్జాల్లా మెత్తగా ఉంటాయి. సువాసనభరితమైన ఈ పండ్లతో జ్యూస్‌తోపాటు స్క్వాష్ కూడా చేసుకుని నిల్వ ఉంచుకోవచ్చు. లేదంటే పాలీథీన్ బ్యాగుల్లో పెట్టి ఫ్రిజ్‌లో పెడితే మూడు వారాలు నిల్వ ఉంటాయి. మనదగ్గర జ్యూస్ రూపంలోనే వాడకం ఎక్కువ. ఆస్ట్రేలియన్లయితే గుజ్జుమీద పంచదార చల్లుకుని నేరుగా తినేస్తారు. పెరుగులోనూ పాలమీగడలోనూ కూడా కలుపుకుని తింటారు. పైనాపిల్, నారింజ రసాల్లోనూ వాడతారు. కొన్ని ప్రాంతాల్లో ఈ జ్యూస్‌ని బాగా మరిగించి సాస్, డెజర్ట్, క్యాండీ, ఐస్‌క్రీమ్, షర్బత్, కేకు, కాక్‌టెయిల్స్ తయారీల్లో ఫ్లేవర్‌కోసం వాడుతుంటారు. పైనాపిల్, అరటిపండు, టొమాటో జామ్‌ల తయారీలోనూ ఈ గుజ్జును వాడతారు. ఈ పండురసంతో పసైయా అనే కూల్‌డ్రింకునూ పార్చిటా సెకో అనే వైన్‌నూ కూడా తయారుచేస్తారు. జీరో డిగ్రీల ఫారన్‌హీట్ దగ్గర ఫ్రీజ్ చేసిన పేషన్ జ్యూస్ ఏమాత్రం పాడవకుండా ఏడాదిపాటు నిల్వ ఉంటుంది.
విటమిన్-సి, ప్రొటీన్లూ, పిండిపదార్థాలూ, పీచూ పుష్కలంగా ఉండే ఈ పండులో యాంటీఆక్సిడెంట్లూ ఎక్కువే. అందుకే ఔషధపరంగానూ ఇది బాగా పనిచేస్తుంది.
* అజీర్తి, అధిక రక్తపోటు, గ్యాస్ట్రిక్ క్యాన్సర్ నివారణకు ఈ జ్యూస్ ఎంతో మంచిదట. గుండెకు బలవర్థకమైన టానిక్‌లా కూడా పనిచేస్తుందట. వూబకాయాన్నీ తగ్గిస్తుంది.
* నాడీసంబంధ లోపాలకీ శ్వాసకోశ ఆస్తమాకీ జీర్ణసంబంధ వ్యాధులకీ మెనోపాజ్ సమస్యలకీ చేసే చికిత్సల్లో ఈ పూలను వాడుతుంటారు. ఈ పూలల్లోని ఫైటోకెమికల్స్‌కి క్యాన్సర్ కణాల్ని చంపే గుణం ఉందని కొన్ని పరిశోధనల్లోనూ తేలింది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment