- =======================================
Sunday, March 20, 2011
స్టార్ ఫ్రూట్స్ , Star Fruits
పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....
కొన్ని పండ్ల పేర్లు వింటాం గానీ చూడడం అరుదే. మార్కెట్లో కనిపించినా ఏ కొద్దిరోజులో కనిపించి మాయమైపోతాయి. అలా ఈ వేసవిలోనూ అదీ అరుదుగా మాత్రమే కనిపించే కొన్ని రకాల...పండ్లలో స్టార్ ఫ్రూట్ ఒకటి.
స్టార్ ఫ్రూట్‌గా మనమంతా పిలుచుకునే ఈ పండు ఇప్పుడు మనరాష్ట్రంలో కూడా విరివిగానే దొరుకుతుంది. కోస్తే నక్షత్రం ఆకారంలో కనిపించే ఈ పండు రసభరితంగా తినడానికి రుచిగా బాగుంటుంది. అందుకే దీన్ని నేరుగానే తింటుంటారు. ద్రాక్ష మాదిరిగానే వీటిమీద కూడా మైనపు పూత ఉండి మెరుస్తుంటాయి. బాగా పండిన పండ్లు పసుపురంగులోకి మారి తియ్యగా ఉంటాయి. ఎక్కడో పులుపు తగులుతుంటుంది. అయితే వీటి రుచి ఇది అని చెప్పడం కష్టం. యాపిల్, పియర్, సిట్రస్ పండ్లు కలగలిసిన రుచితో ఉంటుందని కొందరంటే, బొప్పాయి, నారింజ, గ్రేప్‌ఫ్రూట్ కలగలసిన రుచిలో ఉంటుందని మరికొందరంటారు. అదే పచ్చి స్టార్ ఫ్రూట్ అయితే కాస్త పుల్లగా గ్రీన్ యాపిల్ మాదిరిగా ఉంటుంది. సాధారణంగా ఇందులో తియ్యగా ఉండేవీ, కాస్త పుల్లగా ఉండేవీ రెండు రకాలున్నాయి. తియ్యనివి వేసవి నుంచి శీతాకాలం వరకూ కాస్తే పుల్లనివి వేసవి చివర నుంచి చలికాలం మధ్య వరకూ మాత్రమే కాస్తాయి.
యాంటీ ఆక్సిడెంట్లు, పీచు, విటమిన్- సి పుష్కలంగా ఉండే ఈ పండ్లు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. మలబద్ధకాన్ని నివారిస్తాయి. కామెర్లనీ తగ్గిస్తాయి. ముఖ్యంగా వేసవి వేడిని తగ్గించి వడదెబ్బ తగలకుండా కాపాడతాయి. పాలిచ్చే తల్లులు తింటే పాలు బాగా పడతాయి. కళ్ల మంటల్నీ తగ్గిస్తాయి. అలసటనీ అజీర్తినీ జలుబు, ఫ్లూ జ్వరాల్నీ నివారిస్తాయి. కోకమ్, పేషన్ పండ్ల మాదిరిగానే ఊబకాయాన్ని తగ్గించడానికీ దోహదపడుతుంది. అయితే మూత్రపిండవ్యాధులతో బాధపడేవారు మాత్రం దీన్ని తినకపోవడమే మంచిది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment