Wednesday, March 16, 2011

చింత చింతకాయలు ,చింతపండు , Tamarind tree parts uses

పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం..... చింత (Tamarind) ఒక వృక్షం. దీన్ని 'భారతదేశపు ఖర్జూరం' అంటారు. ఇది ఫాబేసి కుటుంబంలో సిసాల్పినాయిడే ఉపకుటుంబానికి చెందినది. దీని శాస్త్రీయ నామం టామరిండస్ ఇండికా. భాషా విశేషాలు తెలుగు భాషలో చింత పదానికి వివిధ పద ప్రయోగాలున్నాయి. పెంకుతోనున్న చింతపండును చింతగుల్ల అంటారు. కాయని చింతకాయ అని పండును చింతపండు అని అంటారు. పులిచింత ఒక ఆయుర్వేద మందుగా మరియు ఆవకాయగా వాడు చిన్న మొక్క Oxalis corniculata. Heyne. సీమ చింత చెట్టు, ఎర్రచింత, కారువేగి or చిందుగ అనగా Albizzia odoratissma. ఒక రకమైన చింతచెట్టు. చింతనాగు ఒక విషసర్పం Coluber naga, దీని శరీరం మీద చింతపువ్వు మాదిరి గుర్తులుంటాయి. చింత అనగా ఆలోచనా విధానంలో దుంఖానికి వాడతారు. ఉదా: చింతలేదు (never mind, no matter), ప్రకృతి వనరుల్లో మనకి నిత్యం ఉపయోగపడే వృక్ష సంతతిలో చింతచెట్టు ఒకటి. దీనిని వాడని భారతీయుడంటూ ఎవరూ ఉండరు. తెల్లారి వంట పూర్తికావాలంటే చింతపండు లేకపోతే చింతతో అల్లాడిపోతాం. ఇటువంటి చింత గురించిన వివరాలు ఎన్నో ఉన్నాయి. వాటిని పరిశీలిస్తే, ఈ చెట్టు ఆకులు, పువ్వులు, పండ్లు, కాండం అన్ని ప్రయోజన కరమైనవిగానే చెపðకో వాలి. ఇది ఆఫ్రికా దేశానికి చెందిన వృక్షం. దీనిని సంస్కృతంలో తింత్రిణీ అని, తెలుగులో చింత అని, కన్నడంలో హుళి అని, తమిళంలో పుళి అని, మరాఠీలో చించి అని, హిందీలో ఇంమ్లి అని అంటారు. చింతచెట్టు ఇంచుమించు 20 మీటర్ల ఎత్తు పెరుగుతుంది. ఇవి వేసవికాలంలో కూడా దట్టంగా ఉండి చల్లని నీడనిస్తాయి. చింతాకులలో 10-40 చిన్న పత్రకాలుంటాయి. చింతపండు గుజురు మధ్యలో గట్టి చింతపిక్కలు ఉంటాయి.
  • source : http://www.hort.purdue.edu/newcrop/morton/tamarind.html
ఉపయోగాలు
  • దక్షిణ భారతదేశీయుల ఆహారంలో ఇది ముఖ్యమైన భాగం. రసం, సాంబారు, రకరకాల పులుసులు, పచ్చడి లో చింతపండు రసం పుల్లని రుచినిస్తుంది.
  • చింతకాయలు లేతగా ఉన్నప్పుడు వాటి రసంతో చారు చేస్తారు.లేత చింతకాయలతో చట్నీ చేస్తారు. వాటి గుజ్జును పప్పులో కలుపుతారు, అయితే, లేత చింతకాయలను అధికంగా వాడకూడదు.
  • ఎందుకంటే వీటిని ఎక్కువగా తింటే జలుబు చేస్తుంది. చింతకాయలు ముదిరి గింజ ఏర్పడినప్పుడు వాటితో నిలవ పచ్చడిని తయారుచేస్తారు. ఇవి ప్రత్యేకంగా సీజన్‌లో మాత్రమే లభిస్తాయి.
  • చింతకాయలతో, మిరపపళ్ళను కలిపి నిలవ పచ్చడిని తయారుచేస్తారు కొంతమంది. ముదిరిన చింత కాయకు వేడిచేసే గుణముంది. అది త్వరగా జీర్ణంకాదు. అతిగా తింటే కడుపులో మంట ఏర్పడుతుంది. పండితే సులువుగా జీర్ణమవుతుంది.
  • చింతగుల్లనుంచి వచ్చిన చింతపండును వాడని వారుండరు. చింతపండును ఎండలో కొంత సమయం ఉంచి ఆ తర్వాత వాడటం ఆరోగ్యకరం. ఇందులో ఉండే పుల్లలు, గింజలు తీసి భద్రపరిస్తే పురుగు పట్టదు. చింతపండు తేలికగా అరుగుతుంది. ఆహార పదార్థాలకు రుచిని కలిగిస్తుంది. అమిత దాహాన్ని అరికడుతుంది. కొత్త చింతపండు కంటే పాత చింతపండును వాడటమే ఆరోగ్యకరం. లేత చింత ఆకులను చింతచిగురు అంటారు. దీన్ని ఆకుకూరగా వాడుతారు. చింతచిగురును నీడలో ఎండబెట్టి చింత చిగురు పొడిని తయారు చేస్తారు. ఈ పొడిని అన్నింటిలో
  • కలిపి తింటే ఎంతో రుచిగా ఉంటుంది. రక్తహీనతను తొలగించి, రక్తం పట్టేలా చేస్తుంది. చింతచిగురు రసంలో పటిక బెల్లం కలిపి తాగితే, కామెర్ల వ్యాధికి నివారణ కలుగుతుంది. వాతాన్ని హరిస్తుంది. మూలవ్యాధులకు ఉపశమనాన్ని కలిగిస్తుంది. చింతచిగురు ఉడికించి కీళ్లవాపులకు రాసినట్లయితే వాపు, నొప్పి తగ్గిపోతాయి. చింతపువ్వులను ఆహారంగా కూడా ఉపయోగిస్తారు. వీటితో పప్పు, చట్నీ చేస్తారు. కందిపప్పుతో కలిపి పొడి కూరను చేస్తారు.
  • * చింతాకు: లేత చింతచిగురును ఆకుకూరలు మాదిరిగా ఉపయోగిస్తారు. కొన్నిరకాల పచ్చడి చేస్తారు. ఫిలిప్పైన్స్ లో చింతాకుతో చేసిన టీ మలేరియా జ్వరానికి వైద్యంగా వాడతారు.
  • * చింతకాయ: పులిహోర, పచ్చడి తయారుచేస్తారు. చింతచెట్టులోని ప్రతి భాగామూ ఉపయోగపడుతుంది. చింతచెట్టు వుంటే చింతే ఉండదంటారు పెద్దలు. ప్రతిరోజు వండే ఆహారపదార్థాల్లో *చింతపండుకు ప్రత్యేకస్థానం ఉంది. చింతచిగురు, లేత చింతకాయలు, ముదురు చింతకాయలు, పండిన చింతగుల్లలు, చింతపువ్వు, చింతగింజలు ఎంతో ఉపయోగపడతాయి.
  • * చింతపండు: పులుసు పుల్లదనానికి చాలా ఆహారపదార్ధాలలో ఉపయోగిస్తారు. దీనిని కూరలలోను, సాస్, పచ్చళ్ళు, కొన్ని పానీయాల తయారీలో విస్తృతంగా వాడాతారు. ఆసియాలో *చింతపండు పీచు కంచు, రాగి పాత్రల్ని శుభ్రం చేయడానికి మెరుపు తేవడానికి వాడతారు.
  • *ఈజిప్టులో చింతపండు రసం చల్లని పానీయంగా సేవిస్తారు.
  • *థాయిలాండ్ లో తియ్యని ఒకరకం చింతపండును ఇష్టంగా తింటారు.
  • *చింతపువ్వులను ఆహారంగా కూడా ఉపయోగిస్తారు. వీటితో పప్పు, చట్నీ చేస్తారు. కందిపప్పుతో కలిపి పొడి కూరను చేస్తారు.
  • * చింతపిక్కలు: బిస్కట్ ల తయారీలో ఉపయోగిస్తారు.
  • * చింతకొమ్మ: పాఠశాలల్లో పిల్లల్ని శిక్షించడానికి వాడేవారు.
  • * చింతకలప: ఎరుపు రంగులో దృఢంగా ఉండడం వల్ల కలపగా ఇంటిసామాన్లు తయారీలో వాడతారు.
  • * చింతచెట్టు: రహదారి కిరువైపులా నీడకోసం వీటిని పెంచేవారు.
----- వైద్యపరంగా : ఇక ఈ చింతచెట్టునుంచి లభ్యమయ్యే అతి ముఖ్య పదార్ధం చింతకాయలు, చింతపండు. వీటిని పచ్చళ్ళలో వంటకాలలో విరివిగా నిత్యం వినియోగిస్తూవుంటారు. గింజలు, ఉట్టి తీసిన
  • 100 గ్రాముల చింతపండు 283 కేలరీల శక్తిని ప్రసాదిస్తుంది.
  • సిట్రిక యాసిడ్‌ గుణాలు కలిగున్న చింతపండు ఆయుర్వేద పరంగా, పులితేనుపులు అరికట్టడానికి,
  • కడుపు ఉబ్బరానికి,
  • జ్వరం,
  • వికారం మొదలైన రోగాలకి మందులా వాడతారు.
  • ఆకలి మందగించినవారు ఉదయాన్నే 4-5 చెంచాల చింతపండు రసాన్ని సేవిస్తే మంచి ఆకలి పుడుతుంది.
  • శరీరంలోని వాపులకి,
  • నొప్పు లకి చింతపండు రసంలో ఉపð కలిపి మసాజ్‌ చేస్తే మంచి ఉపశమనం ఉంటుంది.
  • అలాగే కంకు దెబ్బల వల్ల వచ్చిన వాపులకీ, బెణుకులకి చిక్కటి చింతపండు రసం తీసి దానిని ఉడికించి గోరు వెచ్చగా ఉన్నపðడే ఆ వాపులపై పూస్తే వెంటనే తగ్గుతాయి.
  • భోజనానంతరం రసం (చారు) పోసుకోడంలో ఉన్న మర్మం ఏమిటంటే, ఇది జీర్ణశక్తిని పెంచి తిన్నది తేలికగా జీర్ణం అవుతుంది.
  • అజీర్ణరోగాలకి, జీర్ణశక్తిని పెంచ డానికి చింతపండు దివౌషధంగా ఉపయోగ పడుతుంది. నిత్యం ఈ ఇబ్బందులు ఎదు ర్కొనేవారు. గ్లాసుడు పాలలో కాచి చల్లార్చిన చింతపండు రసం 4-5 చుక్కలు వేస్తే పాలు విరిగిపోయి, పైన నీళ్ళు తేలతాయి. ఆనీటిని గనుక రోజుకు మూడు పూటలా తాగుతూవుంటే ఈ రోగాలనుంచి విముక్తి కలుగుతుందని ఆయుర్వేద శాస్త్రం చెప్తోంది.
  • చింతచిగురు రసంలో పటిక బెల్లం కలిపి తాగితే, కామెర్ల వ్యాధికి నివారణ కలుగుతుంది.
  • వాతాన్ని హరిస్తుంది. మూలవ్యాధులకు ఉపశమనాన్ని కలిగిస్తుంది.
  • చింతచిగురు ఉడికించి కీళ్లవాపులకు రాసినట్లయితే వాపు, నొప్పి తగ్గిపోతాయి.
ప్రకృతిదక్షిణ భారతదేశంలో ప్రజలు ఎక్కువగా చారు, సాంబారు మొదలైనవి ప్రతిరోజూ వాడుతూవుంటారు కాబట్టి
  • మూత్రకోశ వ్యాధులు,
  • మూత్రకోశంలో రాళ్ళు, మొదలైన వ్యాధులు తక్కుగా వుంటాయి.
  • గుండె జబ్బులకు కూడా ఇది మంచి ఉపశమనాన్ని ఇస్తుంది.
ఇక చింతగింజలు కూడా ఆరోగ్య విషయంలో ఆయుర్వేదపరంగా ఎంతో విలువైనవి.
  • చింతగింజలు పొడిచేసి ప్రతిరోజు చెంచాడుపోడి నీటిలో కలిపి సేవిస్తూవుంటే ఆమశంక, జిగట విరేచనాలు తగ్గుతాయి.
  • అలాగే తినే పదార్ధంగా అనుపానంగా చింతగింజల పొడిని సేవిస్తూవుంటే రక్తశ్రావం తగ్గుతుంది.
  • చింతపిక్కల పొడిలో పంచదార కలిపి వారం రోజులపాటు తీసుకుంటే, వీర్యస్ఖలనాన్ని నివారిస్తుంది. వీర్యాభివృద్ధిచేస్తుంది.
చింతచిగురులో విటమిన్‌ ఎ. సి. ఐరన్‌ పుష్కలంగా వున్నాయి. చింతచిగురుని వంటకాల్లో కూడా వాడడం మనందరికీ తెలిసిన విషయమే.
  • ఇక చింత కర్ర బొగ్గుగా కాల్చి, ఆ బోగ్గుల పొడిలో ఉపð, పిప్పర్‌మెంట్‌ పువ్వు కలిపి పంళ్ళపొడి తయారు చేస్తారు.
  • చింత బొగ్గులపొడిలో నువ్వుల నూనె కలిపి కాలిన చోట రాస్తే కాలిన గాయాలు మానిపోతాయి.
  • అన్నకోశవ్యాదితో బాధపడేవారు లవంగాలు, దాల్చినచెక్క నూరి 10 మి్ప్పలీటర్ల చింతపండు రసంలో కలిపి ప్రతి 4 గంట్ల కొకసారి పుచ్చుకుంటూవుంటే, మంచిగుణం కనబడుతుంది.
  • 120 మిల్లీలీటర్ల చింతపండు రసంలో ఆరు గ్రాముల పంచదార కలిపి సేవిస్తూవుంటే తలతిరగడం తగ్గుతుంది.చింతగింజల పొడి డయేరియాను నివారిస్తుంది. డిసెంటీకి చక్కని ఔషధంగా పనిచేస్తుంది.
  • చింతచెట్టు వేరు గుండె ఆనారోగ్యాలను నివారిస్తుంది.
  • ఈ చెట్టు బెరడు టానిక్‌లా ఉపయోగిస్తుంది. చింతగుల్ల నుంచి చింతపండులో విటమిన్‌ బి, కాల్షియం అధికంగా ఉంటాయి.
ఈ విధంగా ఆసియా ఖండంలోని అనేక దేశాలతో పాటు ఆఫ్రికా మొదలైన దేశాలలో కూడా చింత వనరులు ఎంతో వినియోగంలో ఉన్నాయి. చింతలో ఉన్న వెరైటీల్లో తీపి చింత అని ఒకటుంది. ఆ పండు గుజ్జుతో శీతలపానీయాలు తయారు చేసుకుని సేవిస్తూవుంటారు. పులుపు చింతతో ఊర గాయలు తయారుచేసి దేశవిదేశాలలో విక్రయించడంతో దీనికి ప్రపంచ మార్కెట్‌లో ఎంతో స్థానాన్ని పొందింది. వైద్య పరంగా కూడా దీనికి ఉన్న ప్రాముఖ్యత వల్ల ఆయుర్వేదం, హౌమియోపతి, మొదలైన వైద్యవిధానాల్లో ప్రముఖస్థానాన్ని ఆక్రమించిం దంటే ఆశ్చర్యం ఏమీ లేదు.

  •  source : http://www.hort.purdue.edu/newcrop/morton/tamarind.html
  • =========================================
Visit my Website - Dr.Seshagirirao

1 comment:

  1. చింతపండు తినడం వలన పొట్ట ప్యారుగుతుంది అంటారు అది ఎంతవరకు నిజం ?
    చింతపిక్కల పొడిలో పంచదార కలిపి వారం రోజులపాటు తీసుకుంటే, వీర్యస్ఖలనాన్ని నివారిస్తుంది. వీర్యాభివృద్ధిచేస్తుంది.

    చింత పిక్కలు పొడి చేసుకొని తింటే అరుగుతాయ ?

    దయచేసి నాకు సమాధానం చప్పగలరు

    ReplyDelete