Tuesday, January 3, 2012

Our food is our health,మన ఆహారమే మన ఆరోగ్యము

పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....
 
ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.

మనము తినే ఆహారమే మన ఆరోగ్యానికి కీలకము . ఆ ఆహారమే అనారోగ్యకారకమైతే, ఆహారధాన్యాలు , కాయగూరలు , పండ్లు రసాయనిక ఎరువులు , క్రిమిసంహారకాలతో నిందిపోతే మన గతి ఏమిటి ? .ఆరోగ్యం పరిస్థితి ఏమిటి? ఆరోగ్యము బదులు అనారోగ్యము కొనితెచ్చుకోవడమే కాదా? చాలా రోగాలకు ఆహార విహారాలే కారణము . చిన్న పెద్ద ఆస్పత్రులు ... మల్టీ స్పెషాలిటీలు కార్పొరేట్ ఆస్పత్రులూ , స్పెషలిస్ట్ క్లినిక్లు ఎక్కడ చూసినా నిండా జనము . ప్రస్తుతము వచ్చే రోగాలకు వయస్సుతో నిమిత్తములేదు. పట్టుమని పాతికేళ్ళు అయినా నిండని వారు అనారో్గ్యాల బారినపడడము ఆస్పత్రులచుట్టూ తిరగడము చుస్తూఉంటే ... ఎందుకీ అనారోగ్యము ?. మనము ఏం తింటున్నమో అదే మన ఆరోగ్యము ... మన అనారోగ్యము కూడా. మనము తింటున్న ఆహారము బయట , లోపలా క్రిమిసంహారక మందులతో కలిషితమైపోతుంది . రసాయన ఎరువులు , క్రిమిసంహారక మందులు మన శరీరము పైన దుష్పరిణామాలు కలుగజేస్తాయి. క్యాన్సర్ కారకాలు గా మారుతాయని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. అలాగే పోషకవిలువలు లేని పాలిష్ బియ్యము , రసాయనాల రంగులు అద్దుకున్న నిగనిగలాడే కూరగాయలు , పండ్లు కొనుక్కొని తింటున్నాము . పూర్వము సేంద్రియ ఎరువులనే వాడి పంటలు పండేవి . హరిత విప్లవ పర్యవసానం గా వ్యవసాయములో మార్పులు చోటుచేసుకొని రసాయన ఎరువులు , క్రిమిసంహారక మందులు వాడకము ఎక్కువై వాటి అవశేషాలు ఆహారముతో పాటే మన శరీరములో ప్రవేశించి కొత్త కొత్త రోగాలు పుట్టుకొస్తున్నాయి. ఆ విధం గా మానవులు అనారోగ్యపాలవుతున్నారు . హైబ్రిడ్ విత్తనాలు తయారిలో కొత్తవంగడాలు జన్యుమార్పిడి వలన తయారుగుటచే ఇంకొన్ని అనారోగ్యాలు కలిగించవచ్చునే అనుమానము ఉన్నది .
  • ===============================
Visit my Website - Dr.Seshagirirao...

No comments:

Post a Comment