Thursday, May 17, 2012

వేగంగా బరువు తగ్గించే డ్రింకులు,Easy Drinks Quick Weight Loss

పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.
  • మీ డైట్ ప్రణాళిక, జిమ్ వర్కవుట్లూ ఆచరిస్తూనే, మీ శరీరంలోని అధిక బరువును తగ్గించటానికి గాను నాలుగే నాలుగు పానీయాలను సిఫార్సు చేస్తున్నాం. వీటి తయారు కష్టమూ కాదు. తాగటం అంతకంటే కష్టం కాదు. అవేమిటో పరిశీలించి ఆచరించండి. అద్భుతమైన ఫలితాలను వేగవంతంగా పొందండి. ఇంటిలోనే తయారు చేసుకోగల ఈ పానీయాలతో మీ పొట్ట కొవ్వును అతి తేలికగా కరిగించి శారీరక లావణ్యాన్ని పొందండి.
  • నిమ్మరసం -
నిమ్మ, ఆరెంజ్, బెర్రీ మొదలైన రసాలు, ద్రాక్ష రసం కొవ్వును బాగా కరిగిస్తాయి. వీటిలో పీచు అధికం. అనేక పోషకాలు, కార్బోహైడ్రేట్లు వుండి కేలరీలు, కొవ్వు అతి తక్కువగా వుంటాయి. కనుక ప్రతిరోజూ ఒక గ్లాసు క్రమం తప్పకుండా తాగండి. ఈ రసాలలో షుగర్ కలపకండితీపికోసము జీరో పౌడర్ (సుగర్ ఫ్రీ) కలపంది .. నిమ్మరసం అయితే వేడి నీటితో కలిపి కొద్దిపాటి సాల్ట్ వేసి తాగవచ్చు.
  • కాఫీ
- మితంగా తాగితే ఇది బరువు తగ్గేటందుకు అమోఘమైన ఔషధం. కేఫైన్ పొందాలంటే, కోకో, కాఫీ, కోలా, టీ మొదలైవి తీసుకోవాలి. మితిమీరితే శరీరంలో డీహైడ్రేషన్ కలిగిస్తుంది. కాఫీలో షుగర్ కలపకండి.తీపికోసము జీరో పౌడర్ (సుగర్ ఫ్రీ) కలపంది .
  • యాపిల్ సైడర్ వినేగర్
- దీనిని చల్లని నీరు, తేనెతో కలిపి భోజనం ముందు తాగండి. ఆకలిని నియంత్రించి తక్కువ ఆహారం తీసుకునేలా చేస్తుంది. జీర్ణక్రియ పెంచి శరీర మలినాలు తొలగిస్తుంది. బరువు తగ్గటానికి తోడ్పడుతుంది.
  • గ్రీన్ టీ
- శరీరానికి, చర్మానికి, జుట్టుకు ఎంతో ఆరోగ్యాన్నిస్తుంది. దీనిని ఇంటిలోనే తయారు చేసుకోవచ్చు. పొట్టకొవ్వు అతి తేలికగా మాయం అవుతుంది. గ్రీన్ టీ ఆకులు నీటిలో నానపెట్టండి. దానికి కొద్ది చుక్కలు నిమ్మరసం వేయండి. రాత్రంతా అలానే వుంచి ఉదయమే ఖాళీ కడుపుతో తాగండి. గ్రీన్ టీ మీలోని మెటబాలిజం పెంచుతుంది. రోజంతా చురుకుగా వుండేట్లు చేస్తుంది. ఆకలిని కనీసం రెండు నుండి 4 గంటలు అదుపు చేస్తుంది.
  • Courtesy with : telugu.boldsky.com/health/diet-fitness/
  • ==========================
Visit my Website - Dr.Seshagirirao...

No comments:

Post a Comment