Friday, May 18, 2012

ఈత పండు,Silver Date Fruit

పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది. ఈత (Silver Date Palm or Sugar Date Palm), చెట్టు పుష్పించే మొక్కలలో పామే కుటుంబానికి సంబంధించినది. దీని శాస్త్రీయ నామము 'ఫీనిక్స్ సిల్వెస్ట్రిస్'. దీనిని పండ్లు కోసం పెంచుతారు. వీటి నుండి కల్లు తీస్తారు. ఇది భారత ఉపఖండానికి చెందిన పండ్ల చెట్టు. ఈత పళ్ళు ఖర్జూరం పండ్ల లా కనిపించినా వాటి మధ్య చాలా తేడా ఉంటుంది . వీటిని జీర్ణము చేసుకోవడము కష్టము . ఎక్కువ తింటే కడుపు నొప్పి వస్తుంది. వీటి పిక్కలు పెద్దవిగా ఉండి తినే పదార్ధము తక్కువ ఉంటుంది .
  • ఉపయోగాలు
* ఈతచెట్టు నుండి రుచికరమైన ఈతపండ్లు లభిస్తాయి. * ఈతచెట్టు కాండంకు కోతపెట్టి ఈత కల్లు సేకరిస్తారు. * ఈ పండ్ల నుండి తాండ్ర తయారుచేస్తారు. బెంగాల్ లో వీటినుండి బెల్లం తయారౌతుంది.
  • పోషక విలువలు, ప్రతి 100 గ్రాములకు
  • శక్తి ------------------------- 980 kJ
  • పిండిపదార్థాలు--------------- 65 g
  • - చక్కెరలు ------------------53 g
  • - పీచుపదార్థాలు --------------6 g
  • కొవ్వు పదార్థాలు 0.4 g
  • మాంసకృత్తులు -------------2.5 g
  • నీరు -------------21 g
  • విటమిన్ సి -----------------0.4 mg
  • =====================
Visit my Website - Dr.Seshagirirao...

No comments:

Post a Comment