Saturday, May 19, 2012

మదనఫలం,Rendia Spinosa

పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది. 'పెరటిచెట్టు వైద్యానికి పనికి రాదు' అని ఆర్యో క్తిగా అంటారు. కానీ దాని అసలు అర్ధం, ఇం టిలో పెరిగే మొక్కలగానీ, చెట్లు గానీ పనికిరా వని కాదు...! వాటి విలువలు మనం గుర్తించ డం లేదని. ఇంటి పెరటిలో ముబ్బడి దిబ్బడిగా పెరిగే మొక్కలు కేవలం పిచ్చిమొక్కలనుకుంటే పొరపాటే. వాటి విలు వలు కనిపెట్టి పోషిస్తుంటే అవి మన ఆరోగ్యాన్ని సదా కాపాడుతూవుం టాయి. అలా పెరిగి ఉపయోగపడే మొక్కల్లో మదనఫలం చాలా మేలైనది. దీని శాస్త్రీయనా మం 'రెన్డియా స్పై నోసా'. ఇది రుబియాసి కు టుంబానికి చెందిన చెట్లు. ఈ మదనఫలంలో రస, గుణ, వీర్య, ప్రభావ దోషాలు నివారించే శక్తి ఎంతో ఉంది. ఈ చెట్టు పండు, కాయ, పువ్వులు, ఆకుల్లో ఆయుర్వేద గుణాలు సమృద్ధిగా ఉన్నాయి. ఇక ఈ చెట్టు ఆకులు కొద్దిపాటి గుండ్రంగా ఉండి, ఒకదాని కొకటి ఎదురెదురుగా జామాకుల్లా పెరుగుతాయి. ఈ చెట్టు మధ్యమ స్థాయిలో నిటారుగా ఎదుగుతూ చిన్న పాటి శాఖలతో విస్తరిస్తుంది. పువ్వులు పసుపు రంగుతో కలిపిన తెల్లదనంతో చాలా అందంగా ఉంటాయి. దీని పండు గుండ్రంగా ఉండి పసుపు రంగులోగాని, ముదురు బూడిదరంగులో గానీ ఉం టుంది. ఇది పండుగా ఉన్నపడు మెత్తగా తియ్యగా ఉం టుంది. ఈ మదనఫలంలో 33% సపోనిన్‌ అనే రసాయన పదా ర్ధంతో పాటు 'వలేరినిక ఆసిడ్‌', మైనం ఉండి జిగురు పదార్ధం కూడా కలిగివుంటుంది. దీని గింజలో చమురు పదార్ధం కూడా ఉండటం చేత ఆరోగ్యానికి ఎంతగానో దోహదపడు తుంది. ఈ మదనఫలంతో తయారవుతున్న ఆయుర్వేద ఔషధాలు, కఫని సారిక - ఇది కఫాన్ని కరిగించి పలుచన చేస్తుంది. అందువలన కఫదోషాలు త్వరితగతిని నివారించబడ తాయి. కృమిగ్న - ఇది మన శరీరంలో పెరిగే పరాన్నజీవుల్ని నిర్మూలి స్తుంది. లేఖన - ఇది శరీరంలోని ఇతర మలినా లని తగ్గిస్తుంది. రక్త షోడక - ఇది రక్తాన్ని శుద్ధిచేసి ఆరోగ్యంగా ఉంచుతుంది. వమన - ఇది పంచకర్మలో వాంతిని కలిగిస్తుంది. వేదన స్థపన - బాధని, నొపðల్ని నివారిస్తుంది. విషజ్ఞ - ఇది విషానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది. వ్రణరోపణ - గాయాలు, దెబ్బలు మానడానికి దీనిని వాడతారు బాహ్య ప్రయోజనాలు: వాంతిని కలిగించే గింజ పైతొక్క, వాపులవల్ల కలిగే నొపðల్ని తొలగిస్తుంది. అలాగే అల్సర్‌ని శుభ్రపరుస్తుంది. దీని నూనెతో మసాజ్‌ చేస్తే వాతం వల్ల ఏర్పడిన వాపులు నివారించబడి ఉపశమనం చేకూరుతుంది. కీళ్ళనొ పðలు, కీళ్ళవాతంతో బాధపడేవారు దీని గుజ్జుని లేపనం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. కడుపునొప్పికి దీనితో చేసిన కషా యం బొడ్డు చూట్టూ లేపనం చేస్తే తక్షణ ఉపశమనం కలుగు తుంది. మదనఫలంపై తొక్కతో కషాయం చేసి తీసుకుంటే కఫం వల్ల కలిగే చికాకుల్నించి దూరంగా ఉంచుతుంది. ఇలా ఎన్నో మన కళ్ళ ముందు కనిపించే రకరకాల మొక్కల్ని ఉన్నఫళాన పీకేయకుండా జాగ్రత్తగా పరిశీలించి దాని ఔషధగుణాలు అంచనావేసి శ్రద్ధగా పోషిస్తే, ఆ పెరటి చెట్టే ప్రాణవాయువుని, ఆరోగ్యాన్ని కూడా ప్రసాదిస్తుంది. -వాడ్రేవు @ Andhraprabha news paper sunday magazine.
  • =======================
Visit my Website - Dr.Seshagirirao...

No comments:

Post a Comment