కూరలూ, వేపుళ్లూ చేసేప్పుడు తాలింపులో కాస్త ఇంగువ వేయడం చాలామందికి ఓ అలవాటు. ఆ అలవాటు వెనుక ఆరోగ్య సూత్రం ఉంది. అదనపు రుచీ, వాసన కోసం ఉపయోగించే ఇంగువలో శరీరానికి మేలు చేసే పోషకాలెన్నో!
ఇంగువ - వంటలలో వాడే మంచి సుగంధ ద్రవ్యం మరియు చాలా ఔషధ గుణాలున్న మొక్క. 'అస' అంటే పర్షియన్ లో జిగురు. 'ఫాటిడా' అంటే లాటిన్ లో ఘాటైన గంధక వాసన అని అర్ధం. దీనిని ఇండో-ఆర్యన్ భాషల్లో హింగ్, హీంగ్ అని పిలుస్తారు. పర్షియాకు స్థానికమైన ఇంగువ పచ్చిగా ఉన్నప్పుడు ఘాటైన గంధకపు వాసన కలిగి ఉంటుంది. వంటలలో వేసి ఉడికినప్పుడు ఒక విధమైన మసాలాదినుసుల వాసననిస్తుంది.
ఇంగువ మొక్క
ఇంగువ మొక్క శాస్త్రీయ నామం 'ఫెరులా అసఫోటిడా'. ఇది ఇరాన్, ఆఫ్గనిస్థాన్ దేశాలలో విరివిగా పెరుగుతుంది. ప్రస్తుతం భారతదేశంలో పంజాబ్, కాశ్మీర్ రాష్ట్రాలలో వీటిని పెంచుతున్నారు. దీనిని సంస్కృతంలో "హింగు" అంటారు. ఇంగువ మొక్క కాండం లేదా వేరు నుండి తయారవుతుంది. ఇది జిగురులాగా ఉండే ద్రవం. ఒక మూడునెలలో తయారైన ద్రవం రాయిలాగా తయరవుతుంది. ఇది పసుపు రంగులో ఉండి బాగా తీవ్రమైన వాసనతో ఉంటుంది. భారత దేశ వంటల్లో ముఖ్యంగా తెలుగువారి వంటింట్లో దీని స్థానం చెప్పుకోదగినది.
ఇంగువలో గల పదార్థాలు
- కాల్షియం ,
- ఫాస్పరస్ ,
- ఇనుము ,
- కెరటిన్ ,
- బి-విటమిన్.
ఔషధ గుణాలు
- ఇతర సంప్రదాయ వైద్యాలకన్నా యునానీ వైద్యం ఇంగువకి అధిక ప్రాధాన్యాన్ని ఇస్తుంది.
- ఇంగువకి రోగనిరోధకశక్తి ఎక్కువ. గర్భనిరోధకం గా ఇది వాడుక లో ఉండేది. రుతుసమస్యల్ని తగ్గిస్తుంది. ఇందువల్లనే బాలింతలకు ఇచ్చే ఆహారం లో ఇంగువ ముఖ్యమైన పదార్ధం .
- అజీర్తితో బాధపడే వారు రోజూ కూరల్లో కొంచెం ఇంగువ వేసుకొని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. కడుపులో మంట, అన్నం అరగకపోవడం వంటి సమస్యలు దూరమవుతాయి. గ్లాసు నీళ్లలో, లేదంటే మజ్జిగలో చిటికెడు ఇంగువ పొడి వేసుకుని తాగినా జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగవుతుంది.
- చెంచా తేనెలో కొద్దిగా ఇంగువ, సన్నగా తరిగిన అల్లం ముక్కలూ చేర్చి తీసుకొంటే గొంతు మంట తగ్గుతుంది. జలుబూ, దగ్గూ అదుపులోకి వస్తాయి. శ్వాసకోశ సంబంధిత సమస్యలు తగ్గుతాయి.
- క్యాబేజీ, బంగాళాదుంప వంటివి తిన్నప్పుడు కడుపులో గ్యాస్ చేరుకుని ఇబ్బంది పెడుతుంది. ఒక్కోసారి కడుపునొప్పి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సమస్య బాధించకుండా ఉండాలంటే ఈ కూరలు వండేటప్పుడు చిటికెడు ఇంగువ వేస్తే చాలు గ్యాస్ సమస్య బాధించదు.
- రక్తపోటును అదుపులో ఉంచే పోషకాలు ఇంగువలో ఉన్నాయి.
- నెలసరి సమస్యల నుంచి సత్వర పరిష్కారం లభిస్తుంది.
- దీన్ని రోజూ తీసుకోవడం వల్ల వైరల్ ఇన్‌ఫెక్షన్ల బారిన పడే అవకాశాలు తగ్గుతాయి.
- ఆస్తమాతో బాధపడే వారు ఇంగువను తీసుకోవడం వల్ల సమస్య అదుపులో ఉంటుంది.
- మానసిక సమస్యలూ, ఒత్తిళ్ల కారణంగా శరీరంలో విడుదలయ్యే హానికారక హార్మోన్లతో పోరాడే శక్తి ఇంగువలోని పోషకాలకు ఉంది.
- ====================
No comments:
Post a Comment