margarine,మార్గరిన్ :
మార్గరిను అనేది వెన్న(Butter)కు ప్రత్యామ్నాయంగా తయారుచేసినది. దీనినే టేబుల్‌బట్టరు అనికూడా అంటారు.మార్గరినులో 80% వరకు వనస్పతి(hydrogenated fat),12-15%నీరు(తేమగా),మిగిలినది రిపైండ్‌నూనె.రిపైండ్‌నూనె ఒకటి,లేదా అంతకు ఎక్కువగాని వుండును.మార్గరిన్‌ను బేకరిఉత్పత్తులలోనూ,కేకుల తయారిలోనూ వుపయోగిస్తారు.
వివిద వెజిటబుల్ ఆయిల్స్ ను అత్యధక ఉష్ణోగ్రత వద్ద బబ్లింగ్ హైడ్రోజన్ ద్వారా " మార్గరైన్ " తయారవుతుంది దీన్ని తరచూ వెన్నకు ప్రత్యామ్నాయము గా వాడతారు .
వెన్నకు చౌకైన ప్రత్యామ్నాయముగా పందొమ్మిద శతాబ్దములో ఫ్రాన్స్ లో మార్గరైన్ తయారు చేసారు . సైనికిదళాలు , మధ్యతరగతివారు వాడుకునేంద్కుగాను ఈ మార్గరైన్ సృష్టి జరిగినది.
దీనిలో అన్ని ప్రిజర్వేటివ్ లు వాడడము వల్ల దీనికి దీర్ఘకాలిక మన్నిక ఉంటుంది డెయిరీ లేకుండా తయారు చేసే మార్గరైన్ వెన్నకు మంచి ప్రత్యామ్నాయము .
- పోషక విలువలు :
- కొలెస్టిరాల్ తక్కువే ఉన్నా మార్గరైన్ రసాయనికము గా వెలికి తీసిన పదార్ధమైనందున పూర్తిగా ఆరోగ్యకరమైనదని చెప్పడము కష్టము .
- నూనె లో ఉండే విటమిన్లు , ఇతర పోషకాలను అత్యదిక ఉష్ణోగ్రత నశింపజేస్తుంది .
- నికెల్ , కాడ్మియం అవశేషాలతో ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయి.
- మార్గరైన్ లో అత్యదిక స్థాయిలో ట్రాన్స్ ఫాట్స్ ఉంటాయి ...అయితే వెన్నలో శాచురేటెడ్ ఫ్యాట్స్ అధికము .
- కొలెస్టిరాల్ సంబంధిత సమస్యలు ఎక్కువని చెప్తారు.
- రోగనిరోధక వ్యవస్థ పై తీవ్రమయిన ప్రభావాలు ఉంటాయి.
- ========================
No comments:
Post a Comment