బీర్ చాలా పాపులర్ అయినటువంటి ఆల్కహాలిక్ బెవరేజ్. బీర్ వల్ల వివిధ రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని చాలా మంది అభిప్రాయం. ఇది శరీరంలోని టాక్సిన్స్ (విషాలను లేదా వ్యర్థాలను)బయటకు పంపిస్తుంది . మరియు కిడ్నీ స్టోన్స్ ను తొలగిస్తుందని గట్టి అభిప్రాయం ఉంది. అయితే మీరు బీర్ యొక్క బ్యూటీ బెనిఫిట్స్ తెలుసుకొన్నట్లైతే ఆశ్చర్య పడక మానరు. బీర్ తీసుకోవడం వల్ల మరియు అప్లై చేయడం వల్ల చర్మానికి చాలా ప్రయోజనాలున్నాయి. అంటే బీర్ త్రాగడం వల్ల మరియు బీర్ ను చర్మానికి అప్లై చేయడం వల్ల కూడా చర్మానికి మంచిదని అర్థం.
అయితే బీర్ ను ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇంటర్నల్ గా ఆరోగ్యానికి కొంత వరకూ హాని కలిగిస్తుంది. ఒబేసిటికి దారితీస్తుంది మరియు లివర్ ను పాడు చేస్తుంది. కాబట్టి మితంగా తీసుకోవడం చాలా ఆరోగ్యకరం.
Beer uses - బీర్ ప్రయోజనాలు
బీర్ అనగానే మందుబాబులకు తాగాలనిపిస్తుంది. అయితే సాధారణంగా వారానికి రెండుసార్లు బీర్ తీసుకుంటే లావవుతారని కొందరి అపోహ. బీర్ తాగడం వల్ల బోలెడు ప్రయోజనాలున్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. వాటి ఐదు ప్రయోజనాలు మాత్రం మీ కోసం..
1. మాంసాన్ని మారినేట్ చేసేటప్పుడు అంటే మసాలా పట్టించి నానపెట్టేటప్పుడు బీర్ వాడి చూడండి. రుచిగా ఉండడమే కాకుండా ముక్కలు మృదువుగా ఉంటాయి.
2. కడుపు నొప్పిగా ఉన్నప్పుడు ఒక బీర్ తాగేయండి. ఈ కార్బోహైడ్రేటెడ్ డ్రింక్ పొట్టలో ఇబ్బందిని సరిచేయడమే కాకుండా ఇందులో ఉండే ఆల్కహాల్ నొప్పిని తగ్గించేందుకు పనిచేస్తుంది. అయితే అల్సర్, గ్యాస్ట్రిక్ ఉన్నవారు దీనిని వాడవద్దు.
3. ఒక శుభ్రమైన బట్టను బీర్‌లో ముంచి బంగారం నగలను తుడిచి ఆ తరువాత పొడి బట్టతో మరోసారి తుడిచి ఆరపెడితే మిలమిలా మెరవడం ఖాయం.
4. చర్మాన్ని మృదువుగా ఉంచడంలో ఈస్ట్‌ది ప్రధానపాత్ర. ఇది బీర్‌లో ఉంటుంది కాబట్టి నీళ్లలో కొంచెం బీర్ పోసి స్నానం చేస్తే చర్మం మృదువుగా ఉండడమే కాకుండా మెరుస్తుంది కూడా.
5. రొయ్యల్ని వండేటప్పుడు బీర్ కలిపితే మంచి రుచి వస్తుంది. బీర్‌ని మిగతా వంటల్లో కూడా వాడొచ్చు. అయితే బీర్ వేశాక ఎక్కువసేపు ఉడికించకూడదు.
Beauty giving 10 benifits of Beer,బీర్ లో ఉన్న టాప్ 10 సౌందర్యవర్థక గుణాలు
పెప్సికో, కోక్ లాంటి శీతలపానీయాలు లేదా సాఫ్ట్ డ్రింకులు పెట్ బాటిళ్లలో చూస్తున్నాం. ఇక నుంచి బీర్ కూడా పెట్ బాటిళ్ల లో రాబోతోంది. పెట్ బాటిళ్లు రీసైకిల్ చేసి మళ్లీ మళ్లీ వినియోగించుకోవచ్చు. దీని ద్వారా వెస్టేజీ తగ్గించుకోవచ్చునని పర్యావరణానికి కూడా అనుకూలంగా ఉంటుందని కంపెనీలు భావిస్తు న్నాయి. బాటిళ్ల వేస్టేజీ కుప్పలు కుప్పలు నిల్వ ఉండి పర్యావరణానికి హాని చేస్తాయని కంపెనీలు చెబుతున్నాయి. పెట్ బాటిళ్లయితే తిరిగి రీసైకిల్ ద్వారా మళ్లీ మళ్లీ వినియోగించు కోవచ్చునని చెబుతున్నారు. దేశంలో మొట్టమొదటి సారి సాబ్‌మిల్లర్ ఇండియా హేవార్డ్స్ -5000 బీర్, నాక్‌ఔట్ ఒక లీటర్ బీర్లను పెట్ బాటిళ్లను ట్రెయిల్ బేసిస్ ద్వారా మహారాష్ట్ర మార్కెట్లో విడుదల చేసింది. త్వరలోనే దేశవ్యాప్తంగా పెట్ బాటిళ్లను విస్తరించాలనుకుంటోంది.
బీర్ వల్ల చర్మానికి మాత్రమే సంబంధించి ఉపయోగాలు మాత్రమే కాదు. బీర్ వల్ల కేశాలకు కూడా అద్భుతమైన ప్రయోజనాలను అంధిస్తుంది . బీర్ బెస్ట్ నేచురల్ హెయిర్ కండీషనర్ గా మనకు అందుబాటులో ఉంది. అందువల్ల బీర్ యొక్క బ్యూటీ బెనిఫిట్స్ మెండుగా ఉండటం వల్ల పూర్తి శరీర ఆరోగ్యానికి ఉపయోగించబడుతున్నది. చర్మానికి మరియు కేశాలకు బీర్ ను వివిధ రకాలుగా ఉపయోగించవచ్చు . బీర్ త్రాగడం కంటే ఎక్స్ టర్నల్ గా ఉపయోగించడం చాలా ఆరోగ్యకరం మరియు చర్మానికి క్షేమం.
మరి బీర్ వల్ల ముఖ్య బ్యూటీ బెనిఫిట్స్ :
- 1.బీర్ చర్మాన్ని హైడ్రేట్ (తేమ)గా ఉంచుతుంది: బీర్ చర్మానికి తగినంత హైడ్రేషన్ ను కలిగిస్తుంది. అధిక వేడి వల్ల చర్మాన్ని రక్షించుకోవడానికి బీర్ బాత్ చేసేవారు ఈజిప్షియన్లు.
- 2.హెయిర్ కండీషనర్: బీర్ బెస్ట్ హెయిర్ కండీషర్ . తలకు షాంపూ చేసిన తర్వాత బీర్ తో తలను వాష్ చేయడం వల్ల మీ కేశాలు సున్నితంగా మరియు షైనింగ్ తో మెరుస్తుంటాయి.
- 3. చర్మ కాంతిని పెంచుతుంది: చర్మంలో పల పేరుకొన్న టాక్సిన్స్ ను తొలగించడానికి బీర్ బాగా సహాయపడుతుంది. చర్మం నుండి ఎప్పుడైతే మలినాలు(టాక్సిన్స్) తొలగిపోతాయో అప్పుడు మీ ముఖంలో సహజ అందాన్ని చూడవచ్చు. కాంతివంతమైన చర్మం మీ సొంతం చేసుకోవచ్చు.
- 4.చర్మాన్ని సున్నితంగా చేస్తుంది: బీర్ మీ చర్మాన్ని సున్నితంగా మార్చుతుంది . చర్మానికి శ్వాస తగలడానికి మరియు కావల్సినంత మాయిశ్చరైజర్ అంధించడానికి, చర్మాన్ని సున్నితత్వం కోసం బీర్ ను ఉపయోగించవచ్చు . బీర్ లో ఉండే విటమిన్ బి చర్మాన్ని సున్నితంగా మార్చుతుంది.
- 5.బీర్ మీ కురుల విలువను పెంచుతుంది: మీ కేశాలను బీర్ తో శుభ్రం చేయడం వల్ల కురులు ఒత్తుగా మంచి షైనింగ్ తో మెరుస్తుంటాయి. బీర్ హెయిర్ క్వాలిటీని పెంచుతుంది.
- 6.బీర్ చర్మ పిహెచ్ ను నిర్వహిస్తుంది: బీర్ చర్మంలోని పిహెచ్ ను సమతుల్యం చేస్తుంది. చర్మంలో పిహెచ్ సరిగా లేనట్లైతే చర్మం అనేక చర్మసమస్యలను ఎదుర్కోవల్సి ఉంటుంది. పొడి చర్మం మరియు జిడ్డు చర్మం ఏర్పడుతుంది.
- 7.బీర్ వయస్సు మీదపడనియ్యదు: బీర్ లో యాంటీఆక్సిడెంట్స్ ఉండటం వల్ల వయస్సు మీద పడనియ్యకుండా కాపాడుతుంది. చర్మం ఇన్ఫ్లమేషన్ కు గురికాకుండా కాపాడుతుంది. ముఖ్యంగా వయస్సును కాపాడుకోవచ్చు.
- 8.చర్మ క్లెన్సింగ్ కోసం బీర్: చర్మ రంద్రాలను శుభ్రపరిచే సామర్థ్యం బీర్ లో మెండుగా ఉన్నాయి. ఇది ఆల్కాహానిక్ నేచర్. మరియు ఆల్కహాల్ ఒక పర్ ఫుల్ ఏజెంట్ అని మనందరికి తెలుసు .
9.బీర్ బబుల్ బాత్: మీ వద్ద డబ్బు ఎక్కువగా ఉన్నా..అధికంగా బీర్ కొనే సామర్థ్యం ఉంటే బీర్ ను కొని స్విమ్మింగ్ పూల్ లో వేసి బబుల్ బాత్ చేయడం వల్ల చర్మానికి అద్భుతమైన బ్యూటీ బెనిఫిట్స్ ను అంధిస్తుంది . బీర్ తో ఇటు చర్మ మరియు అటు హెయిర్ బ్యూటీ బెనిఫిట్స్ ను పొంది మీ సౌందర్యాన్ని పదింతలు రెట్టింపు చేసుకోవండి...
- 10. బీర్ మొటిమలతో పోరాడుతుంది: బీర్ లో కొన్ని యాంటీబ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి . అవి మొటిమలతో పోరాడటానికి బాగా సహాయపడుతాయి. కాబట్టి బీర్ ను మీ ఫేస్ ప్యాక్స్ లలోని మిక్స్ చేసికొని ప్యాక్ వేసుకోవడం వల్ల మొటిమలు లేని క్లియర్ స్కిన్ మీ సొంతం అవుతుంది.
- ==============================
No comments:
Post a Comment