బరువు తగ్గేందుకు తక్కువ కేలరీ పదార్ధాలు :
బరువు తగ్గే ప్రయత్నం చేస్తున్న వాళ్లు ఏం తినాలన్నా ఇబ్బంది పడుతుంటారు. ఎందుకంటే, ఏం తిన్నా వందల కెలొరీలు కొవ్వుగా మారిపోతుంటాయి కనుక! మరేం ఆలోచించకుండా వంద కెలొరీల లోపుండే ఈ పోషకాలని ప్రయత్నించండి.
ఓ పెద్ద గుడ్డుని తింటే ఎనభై కెలొరీలని మించి అందవు. పైగా అన్ని రకాల పోషకాలూ అందుతాయి.
చెక్కు తీయకుండా ఒక ఆపిల్‌ని ఎంచక్కా తిన్నా మంచిదే. దీన్నుంచి అందే కెలొరీలు డెబ్భైకి మించవు.
పది, పన్నెండు నానబెట్టిన బాదం పలుకులని బరువు పెరుగుతాం అని ఆలోచించకుండా తినేయొచ్చు.వీటి నుంచి కేవలం తొంభై కెలొరీలే అందుతాయి. రోజువారీ అవసరాలకు సరిపడే క్యాల్షియంలో సగం వీటి నుంచి లభిస్తుంది. శరీరానికి మేలు చేసే ఇతర పోషకాలూ పొందవచ్చు.
కొవ్వు తీసేసిన అరకప్పు పెరుగు తింటే ఎనభై ఐదు కెలొరీలు మాత్రమే అందుతాయి.
కొవ్వూ, ఉప్పు పెద్దగా ఉపయోగించని కప్పు సూప్ నుంచి అందే కెలొరీలూ వందలోపే ఉంటాయి.
ఉడకబెట్టిన రెండు చిలగడదుంపలని తింటే ఆకలి తగ్గుతుంది. లభించే కెలొరీలు మాత్రం తొంభయ్యే.
- ================================
No comments:
Post a Comment