Friday, November 8, 2013

Radish,ముల్లంగి (సొత్తిదుంప)

  •  


  •  

  •  
పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి ... ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.....ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.


ముల్లంగి పేరు వింటేనే మూడు ఆమడల దూరం పరుగెడతారని’ సామెత. కానీ, ఆ ముల్లంగే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ముల్లంగితో వివధ రకాల వంటలు చేసుకోచ్చు. ముల్లంగి (Radish) ఒక విధమైన దుంప పంట.-- దుంపవేరుతో పెరిగే గుల్మం.    చిన్న చిన్న తమ్మెలుగా ఫిడేలు ఆకారంలో ఉన్న దిగువ పత్రాలు, రెండు తమ్మెలు గల మధ్య పత్రాలు, కొన భాగంలో అండాకారంలో ఉండే సరళ పత్రాలు. అగ్రస్థ సామాన్య అనిశ్చిత విన్యాసంలో అమరిన కెంపు రంగు తెల్లని పుష్పాలు. కొనదేలిన ముక్కు వంటి నిర్మాణం ఉన్న సిల్వికా ఫలం.

ఉపయోగాలు
  •     ముల్లంగి దుంపలతో ముల్లంగి పులుసు, ముల్లంగి వేపుడు చేసుకోవచ్చును . ఒకటి రెండు వంటకాల్లో తప్ప పెద్దగా ఉపయోగించని ముల్లంగిలో ఎన్నో పోషకాలుంటాయి. ఆ వివరాలు తెలిస్తే, వాటిని ఏదో ఒక రూపంలో తినడానికి ప్రయత్నిస్తాం.
  • మహిళల్ని వేధించే మూత్రాశయ ఇబ్బందులు మొదలుకుని క్యాన్సర్లని కట్టడి చేయడం వరకూ వివిధ సమస్యల్ని నియంత్రించగల శక్తి ముల్లంగి దుంపలకు ఉంది.
  • రోజుకి ఒక కప్పు ముల్లంగిని సలాడ్‌ రూపంలో తీసుకోగలిగితే 'సి' విటమిన్‌ పుష్కలంగా అందుతుంది.
  • తెల్లరక్తకణాలూ వృద్ధి చెంది, వ్యాధినిరోధక శక్తీ పెరుగుతుంది.
  • జలుబూ, దగ్గూ లాంటి సమస్యలూ దరిచేరకుండా ఉంటాయి.
  • దీనికుండే ఒక రకం ఘాటు గొంతు సమస్యల నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది.
  • అధిక కఫాన్ని నియంత్రిస్తుంది.
  • రక్తంలోని వ్యర్థాలను తొలగించి... రక్తానికి తగినంత ఆక్సిజన్‌ని అందించి కాలేయంపై భారం పడకుండా చేస్తుంది.
  • ముల్లంగిని తరచూ తినే వారిలో కామెర్ల వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.
  • శరీరంపై ఏర్పడే తెల్లని మచ్చలను నియంత్రించడంలోనూ ఇవి చక్కగా పనిచేస్తాయి.
  • ముల్లంగిలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఆహారంలో తగినంత పొటాషియం ఉంటే రక్తప్రసరణ సాఫీగా సాగుతుంది. అందుకే అధిక రక్తపోటుతో బాధపడే వారు ముల్లంగిని తరచూ తీసుకోవాలి.
  • మధుమేహ వ్యాధిగ్రస్తులు రోజువారీ ఆహారంలో దీనిని చేర్చుకొంటే రక్తంలో ఒక్కసారిగా గ్లూకోజ్‌ స్థాయిలు పెరిగిపోవడం, తగ్గిపోవడం వంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఉంటాయి.
  • =====================
 Visit my Website - Dr.Seshagirirao...

No comments:

Post a Comment