Monday, August 10, 2009

ఆవాలు , Mustard Seeds

దీని Botanical Name- Family Cruciferae, Brassica spp . పోవు దినుసు గా ప్రతి ఇంట్లో ఉండే ఆవాలు మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వీటిలో మెగ్నీషియం , కాల్సియం , మాగనీస్ , జింక్ , ఒమెగా 3 ఫ్యాటియాసిడ్స్ , ప్రోటీన్లు , పీచుపదార్దము ఉంటాయి . ఘాటైన వాసనను కలిగి ఉండే ఆవాలు ఆయుర్వేదంలో ఎంతో బాగా ఉపయోగపడతాయి. పైథోన్యూట్రియంట్లు, ఖనిజ లవణాలు, యాంటీ ఆక్సిడెంట్లు, డైటరీ ఫైబర్‌ ఎక్కువగా లభిస్తాయి. * ప్రతి వందగ్రాముల ఆవాలలో 9-82గ్రా టోకోఫెనాల్‌ అనే పదార్థం (విటమిన్‌ 'ఇ'కి సమానం) శరీరంలో కొవ్వు నిల్వలు పేరుకోకుండా సహాయపడుతుంటాయి. అందుకనే కొంచెంగా ఆవనూనెను కూరల్లో వాడుకోమని వైద్యులు సూచిస్తారు. * ఆవాల్లోని సెలీనియం రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఊపిరితిత్తుల సమస్యలను, వాపులను తగ్గిస్తుంది. పోపుల్లో వాడినప్పుడు ఆకలిని పెంచి.. ఆహారాన్ని అరిగేటట్లు చేస్తుంటాయి. * గొంతునొప్పి, దగ్గు జ్వరం ఉన్నప్పుడు మరుగుతున్న నీళ్లలో చిటికెడు ఆవపోడి, తగినంత తేనె వేసి ఇస్తే సమస్యలు నియంత్రణలో ఉంటాయి. ఘాటైన నూనెలు క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పోరాడతాయి. ఇవి రక్తప్రసరణను వేగవంతం చేస్తుంటాయి. ఆవాలను దంచి వాపుగల ప్రదేశం, గౌట్‌ నొప్పిపైన పట్టుగా పెడితే ఉపశమనం ఉంటుంది. అరబకెట్‌ వేడినీళ్లలో చెంచా ఆవాల పొడి వేసి కాళ్లను కొద్దిసేపు ఉంచితే పాదాల నొప్పులు త్వరగా తగ్గుతాయి. * తెల్ల ఆవనూనె చర్మ రంగును మెరుగు పరుస్తుంది. దీన్ని శరీరానికి రాసుకొని, నలుగుపెట్టి స్నానం చేస్తే చర్మ సమస్యలు తగ్గి రంగు తేలుతుంది. అలానే కొబ్బరినూనెలో ఆవనూనెను కలిపి శిరోజాలకు రాస్తుంటే ఫలితం ఉంటుంది. * ఆవాలలో ఉండే పోషకాలు (వందగ్రాములలో),
  • తేమ- 6.5గ్రా,
  • పొటాషియం- 20.3గ్రా,
  • కొవ్వు- 39.7గ్రా,
  • ఖనిజాలు- 2.4గ్రా,
  • పీచు- 4.8గ్రా,
  • పిండిపదార్థాలు- 23.8గ్రా,
  • శక్తి- 541కిలో కెలొరీలు,
  • క్యాల్షియం- 490మిగ్రా,
  • ఫాస్పరస్‌- 700మిగ్రా,
  • ఇనుము- 7.9.
  • టోకోఫెనాల్‌-9-82గ్రా
* ఆవాలను చాలా తక్కువ మోతాదులో తీసుకోవాలి. కారణం వీటిలోని ఘాటైన ద్రవ్యాలు పైత్యాన్ని పెంచుతాయి. కడుపు మంట, చర్మ సమస్యలు ఉన్నవారు పోపులకే పరిమితమైతే మంచిది. * మరీ అధికంగా తీసుకొంటే పైత్యం చేసి శరీర వేడిని పెంచుతాయి. దురదలు మంటలు పెరుగుతాయి, కొన్నిసార్లు కడుపులో రక్తం విరుగుతుంది. ముఖ్యంగా ఎండాకాలం, వేడి శరీరం కలవారు మితంగా తీసుకుంటే మంచిది. విరుగుడు మజ్జిగ, పెరుగు. వైద్య పరం గా ఉపయోగాలు :
  • పంటి నొప్పి కలిగినపుడు గోరువెచ్చటి నీటిలో ఆవాలు వేసి కొంత సేపు తర్వాత ఆ నీటిని పుక్కలేస్తే నొప్పి తగ్గుతుంది .
  • ఆవాలపోడితో జుట్టు కడుక్కూంటే .. జుట్టు రాలడం తగ్గుతుంది ..
  • పేలు తగ్గదాని కు తగ్గదనికు ఆవాల పొడి నునే రాసుకోవాలి .
  • మాడు మీద కురుపులు ,దురదలను అవ్వలు తగ్గిస్తయాయి .
  • ఉబ్బసం వ్యాది ఉపశమనానికి ఆవాలను కొద్దిగా చెక్కెరతో కలిపి తీసుకోవాలి.
  • ఆవాల పొడిని తేనే తో కలిపి తీసుకుంటే శ్వాసకోశ సమస్యలను పరిస్కరించవచ్చును .
  • మందం గా ఉన్న పులిపిరి కాయలమీద ఆవాలు నూరిన ముద్దా రాస్తే పులిపిరులు ఎండి రాలిపోతాయి .
  • కీళ్ళ నొప్పులతో బాధపడేవారు .. ఆవాల ముద్దా , కర్పూరము కలిపి బాధించే ప్రాంతమము మీద రాయటం వల్ల భాధ తగ్గుతుంది .
వాడకూడని పరిస్తితులు :
  • జీర్ణ కోశ అల్సర్లు , కిడ్నీ జబ్బులు ఉన్నా వారు
  • దీని వేపర్స్ (పొగలు)కంటికి తగిలితే కన్ను ఇర్రిటేట్ అగును .
  • ఆరు సం. లోపు పిల్లలకు ఇవ్వకూడదు .
--డా|| పెద్ది రమాదేవి-ఆయుర్వేదిక్‌ ఫిజీషియన్‌-ఫోన్‌:9246276791
  • ==============================================
నా వెబ్ సైట్ ని చూడండి -- డా.శేషగిరి్రావు.కాం

No comments:

Post a Comment